టీవీ: క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మి..!!

Divya
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా ఉన్నవారిలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. రష్మీ యాంకర్ గా కంటే ముందు పలు సినిమాలలో నటించింది. చాలా సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించింది రష్మీ అయినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో కి ఈమె యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత పలు సినిమాలలో నటించింది. అలా గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ గా కూడా నటించి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఘాటైన రొమాన్స్ తో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ చిత్రం మంచి విజయం కావడంతో ఈమెకు వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. ఇక సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు పలు ఫోటోలను పలు సేవా కార్యక్రమాలకు సంబంధించి వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలో కూడా చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది రష్మి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే అంశం ఏదైనా ఉంది అంటే అది క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పవచ్చు.. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

రష్మీ అంతకు మించి అనే సినిమాలో ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడడం జరిగింది.. అవకాశం ఇస్తానంటే వెళ్లడం అనేది తన దృష్టిలో ఒక ఛాయిస్ మాత్రమే అని తెలియజేసింది. ఇలాంటి అవకాశానికి క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు కూడా పెట్టారని.. దానిని గౌరవిస్తానని కూడా సంచలన కామెంట్స్ చేసింది. కెరియర్ బాగుపడుతుంది అనిపిస్తే అలా వెళ్లడంలో ఏమి తప్పు లేదని తేల్చి చెప్పింది రష్మి. ఇద్దరు అంగీకారంతో పరస్పరం జరిగే వాటినిక్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టడం ఏంటి అంటూ అంటూ సమాధానం తెలియజేసింది. అయితే ఇండస్ట్రీలో తనకి ఇలాంటివి ఎప్పుడూ ఎదురు కాలేదని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: