టీవీ : బుల్లితెరపై ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుదంటే..?

Divya
ఇటీవల కాలంలో తెలుగు సినిమా ప్రమోషన్స్ బాగా చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ సినిమాను ఎంత గొప్పగా తీశారు .. ఎంత భారీ బడ్జెట్ ఖర్చు చేశారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేశారు అనేది ప్రజల్లోకి వెళుతుంది. సినిమాను అక్కడ ఇక్కడ ప్రమోట్ చేస్తేనే కదా ఆ సినిమా గురించి ప్రజలకు తెలుస్తుంది . కాబట్టి ఆ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇక రాజమౌళి లాంటి దర్శకులు కూడా లక్షల్లో ఖర్చు చేసి మరీ తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. దర్శక నిర్మాతలు సినిమాల ప్రమోషన్ కి ఇటీవల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ బాగా తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినీ నటీనటులు ప్రేక్షకుల దగ్గరకు నేరుగా వెళ్లి తమ సినిమా గురించి చెప్పడం చాలా హర్షదాయకం అని చెప్పవచ్చు.
ఇకపోతే అందులో భాగంగానే బుల్లితెరపై కూడా చాలా సినిమాలను ప్రమోట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం జబర్దస్త్ లో అయినా సరే ఒక సినిమాను ప్రమోట్ చేయాలి అంటే షో నిర్వాహకులు ఎంత తీసుకుంటారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమాకి ఉన్న రేంజ్ ను బట్టి , ఆ షో రేటింగ్ ను బట్టి, పాపులారిటీ బట్టి కూడా అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. ముఖ్యంగా ఒక షోకి టాప్ రేటింగ్ ఉంటే సినిమా నిర్మాతలు ఆ షోలో ప్రమోషన్ కి ఇచ్చే అమౌంట్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇక జబర్దస్త్ క్యాష్ వంటి ప్రోగ్రాముల్లో సినిమా చేయాలి అంటే మాత్రం నిర్మాతలు లక్షల రూపాయలను ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం.
ఇక ఈటీవీ , మల్లెమాల వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ షోలో ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే రూ.15 లక్షల వరకు సదరు నిర్మాత ఈటీవీ అలాగే మల్లెమాలవారికి చెల్లించాల్సి ఉంటుంది.ఈ విలువ గతంలో రూ. 25 లక్షలు ఉండేది. కానీ ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ తగ్గిపోతున్న నేపథ్యంలో కేవలం రూ. 15 లక్షలు మాత్రమే సినిమా నిర్మాతలు నిర్వాహకులకు ఇస్తున్నారు. క్యాష్ ప్రోగ్రాం కి అయితే 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: