సుధీర్ ని చాలా మిస్ అయ్యా అంటూ కన్నీరు పెట్టుకున్న ప్రముఖ హీరోయిన్..!!

Divya
జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సుడిగాలి సుదీర్. తనను తలచుకొని ఒక ప్రముఖ హీరోయిన్ బాగా కన్నీరు పెట్టుకుంటుంది . ఇక ఆమె ఎవరో ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ఇటీవల రోజా మంత్రి పదవి దక్కిన తర్వాత జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రముఖ హీరోయిన్ అలనాటి అందాలతార ఇంద్రజ జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలపడంతో పాటు భర్త గురించి, ఆమె గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది.

ఇకపోతే బుల్లితెరపై జడ్జిగా ఆడియన్స్ ను  అలరిస్తున్న ఈమె మొదట్లో గెస్ట్ గా వచ్చేది. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా పర్మినెంటు జడ్జి గా మారిన ఇంద్రజ షోలో పోస్ట్ గా పనిచేస్తున్న సుడిగాలి సుధీర్ తో  మంచి అనుబంధం ఏర్పరుచుకుంది. తల్లి కొడుకులా అంటూ వీళ్ళు చేసే కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. అయితే ఈ షో నుంచి సుధీర్ తప్పుకోవడంతో ఇంద్రజ కూడా తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగానే ఎవరి గురించి ఏ విషయము చెప్పను అని.. ఒకవేళ తెలిసినా ఆ విషయం చెప్పడానికి తనకు ఆసక్తి లేదు అని స్పష్టం చేసింది.

కానీ జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడంతో చాలా మిస్ అయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇంద్రజ. శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ ను నేను సిద్దు అని పిలిస్తే.. సిద్ధు నన్ను రాజీ అని పిలుస్తాడు l. అతను అమ్మ అని నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక జబర్దస్త్ నటుడు ప్రవీణ్ నాకు దేవుడిచ్చిన కొడుకు.. అబ్బాయి చాలా మంచివాడు.. అతడికి వాచ్ కూడా గిఫ్టుగా ఇచ్చాను అంటూ తెలిపింది. ఇకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడంతో కెవ్వుకార్తిక్ కూడా ఒక స్కిట్ చేయడం జరిగింది. కార్తీక్ సుధీర్ లా కళ్ళకు అద్దాలు పెట్టుకునే టైం లో ఒక్కసారిగా సుధీర్ గుర్తొచ్చి ఏడ్చేశాను అంటూ తెలిపింది. ఏది ఏమైనా ఇంద్రజ.. సుధీర్ ను  బాగా మిస్ అవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: