సొంత వారినే బ్లాక్ మెయిల్ చేసి జబర్దస్త్ కి వచ్చిన లేడీ ఆర్టిస్ట్?
దైర్యం చేసి రావడమే కాదు అందరి చేత భళా అనిపించుకునేలా గుర్తింపు పొందింది. వద్దన్న కుటుంబ సభ్యులు నేడు ఆ ఆర్టిస్ట్ మా అమ్మాయి అని గర్వంగా చెప్పుకునేలా మారింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు ఫాహిమా . పటాస్ షో తో ఈమె ప్రయాణం మొదలయ్యింది. ఆ షో లో ఒక ప్రేక్షకురాలిగా వచ్చిన సైమా తన స్వరం , అలాగే స్లాంగ్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇక అలా అక్కడ నుండి ఏకంగా బిగ్గెస్ట్ తెలుగు కామెడీ షో జబర్దస్త్ లో అవకాశం అందుకుంది. అయితే ఈ షో కి వెళ్ళడానికి మొదట ఇంట్లో వాళ్ళు అస్సలు వద్దన్నారట అయినా ఆమె వినకుండా వారిని బ్లాక్మెయిల్ చేసి మరీ షోకి వచ్చింది.
అలా వచ్చిన ఫాహిమా తన ప్రతిభతో ఇపుడు ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె స్కిట్ లు చూసినా ఎవరైనా తనకు అభిమాని అయిపోవాల్సిందే. అంతమంది మగ ఆర్టిస్ట్ ల ముందు వారికీ ఏమాత్రం తీసిపోని రీతిలో తన ప్రదర్శన తో ఆకట్టుకుంటూ ఉంది ఫాహిమా .