టీవీ: జబర్దస్త్ నరేష్ కు చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చిందా..?

Divya
బుల్లితెరపై జబర్దస్త్ లో బాగా హడావిడి చేసే పొట్టి నరేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చూడడానికి చిన్న పిల్లాడిలా ఉన్నాడు కానీ చిచ్చర పిడుగు అని చెప్పవచ్చు. అతడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆడియన్స్ కి ఎంతో బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. నరేష్ వేసే పంచులు కూడా ఒక రేంజ్ లో బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. మొత్తానికి జబర్దస్త్ షోలో తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తూ బాగా నవ్విస్తూ ఉంటాడు నరేష్. ప్రస్తుతం ఈ క్రమంలోనే కమెడియన్ గా తనకంటూ అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తున్నాడు.
ఇక ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. దీంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన లైఫ్ లో జరిగిన జబర్దస్త్ జర్నీ తనకు చాలా నచ్చిందని తెలియజేశారు. ఇక తను కారు, ఇల్లు కొనుక్కోవాలని తన డ్రీమ్ అని తెలియజేశారు. ఇప్పటికే కారు కొనుక్కున్నారు అని తెలియజేశారు అంతేకాకుండా త్వరలో కూడా ఇల్లు తీసుకోబోతున్నామని కూడా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని తెలియజేశారు.

ఇక ఇల్లు కొన్న అనంతరం కచ్చితంగా వివాహం చేసుకుంటానని నరేష్ తెలియజేశారు. ఇక తనకు వివాహం జరిగితే అది ఒక విచిత్రం అవుతోందని తెలియజేశారు. ఇక జబర్దస్త్ ఫ్యామిలీ మొత్తం తనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని తెలియజేశారు. ఇదే క్రమంలో చిరంజీవి ని ఎప్పటికైనా ఒకసారి కలవడం తన డ్రీమ్ అని తెలియజేశారు అలా.. తనకు భోళా శంకర్ సినిమాలో చిరంజీవి గారే తన పేరును రికమండేషన్ చేశారని తెలియజేశారు. అంతేకాకుండా చిరంజీవి గారు తన పేరు చెప్పడం ఒక గొప్ప అనుభూతి అని కూడా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తనను చూసి చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారని తెలిపారు నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: