"బిగ్ బాస్ 6" కంటెస్టెంట్ లిస్ట్ వైరల్... ఈసారి మాములుగా ఉండదు?

VAMSI
బిగ్ బాస్ రియాలిటీ షో....ప్రపంచ వ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులోనూ మొదలయిన ఈ రియాలిటీ షో ఇప్పటికే అయిదు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఒకే తెరపై చాలా మంది సెలబ్రిటీలు కనిపించడంతో ఈ షోకి ఎక్కువగా హైప్ వచ్చిందనే చెప్పాలి. అందులోనూ ఇది స్క్రిప్ట్ లా కాకుండా రియాలిటీ షో కావడంతో ఎక్కడ లేని ఆదరణ దక్కుతోంది. కొందరు ఇది జస్ట్ షూటింగ్ కానీ బయటకు మాత్రం నిజ సన్నివేశాలు అని చెబుతున్నారు అంటున్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందరో యాక్టర్స్ ఈ బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక సెలబ్రిటీలు గా మారారు.
అయితే తెలుగులో మొదటి అయిదు సీజన్లు ప్రేక్షకుల మెప్పును పొంది టాప్ రేటింగ్ తో దూసుకుపోగా... ఆ తరవాత ఓ టి టి లో ప్రసరమైతున్న బిగ్ బాస్ షో కి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదనే చెప్పాలి. అసలు తెలుగు ప్రేక్షకులు నిత్యం తప్పకుండా చూసే ఈ షో ఇపుడు ఓ టి టి లో వస్తుండటంతో అసలు ఇంటి సభ్యులు ఎవరు అన్న విషయం కూడా చాలా మందికి సరిగా తెలియదు. కాగా ఇపుడు అందరి దృష్టి బిగ్ బాస్ సీజన్ 6 పై కేంద్రీకృతమై ఉంది. బిగ్  బాస్ షో ప్రేమికులంతా అంతా సీజన్ 6 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీజన్ 6 కి సంబందించిన వార్త ఒకటి వైరల్ గా మారింది.
సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు ఎవరివి అంటే.  యాంకర్‌ మంజూష, సింగర్‌ మోహాన భోగరాజు,  ఆశా షైనీ, య్యూట్యూబ్‌ యాంకర్‌ రోషన్‌,  ట్రాన్స్‌ జెండర్‌ తన్మయ్‌,  యాక్టర్‌ లక్ష్య్‌ చదలవాడ, న్యూస్‌ యాంకర్‌ పద్మిని,  నటి సంజనా చౌదరీ, కొరియోగ్రాఫర్‌ పొప్పి మాస్టర్‌,  సినీ విమర్శకుడు విజ్ఞాన్‌ దాసరి,  యాక్టర్‌ భరత్‌ కుమార్‌,  యూట్యూబ్‌ నటి కుషిత కల్లపు, నటి ప్రీతి అస్రాని, నటుడు చైతన్య గరికపాటి, యాక్టర్‌ కౌశిక్‌,  టీవీ నటి కరుణ, నటి శ్రీ మంగం మరియు నటుడు సుమంత్‌ అశ్విన్‌. అయితే గతంలోనూ ఇలాగే లిస్ట్ లు వచ్చినా అందులో కొందరు మాత్రమే ఫైనల్ అయ్యేవారు. దీనితో ఎవ్వరూ ఈ వైరల్ అవుతున్న లిస్ట్ ను పట్టించుకోవడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: