టీవీ: యాంకర్ రవి కూతురి క్యూట్ డాన్స్ వీడియో వైరల్..!!

Divya
బుల్లితెరపై పై యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యాంకర్ రవి.. ఇతని గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో, ఈవెంట్ లో మెరుస్తూ ఉంటాడు రవి.. దీని ద్వారా ఎంతో మంది అభిమానులను కూడా మూటగట్టుకున్నాడు.. యాంకర్ రవి సోషల్ మీడియా లో కూడా ఎంతో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇక ఇదే తంతు లోనే సోషల్ మీడియా వేదికగా తన కూతురు వియా, భార్య నిత్య గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటాడు.
బిగ్ బాస్-5 లో పాల్గొన్న రవి విన్నర్ అవుతాడు అనుకుంటే అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు.. అంతేకాకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులపై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రవి తన భార్య నిత్య రవి గురించి కొన్ని విషయాలను ప్రమోట్ చేస్తూ ఉండేది.. దీంతో ఆమెపై నెగిటివ్ కామెంట్ కూడా నెటిజన్లు చేయడం జరిగింది. ఇక తన కుటుంబం పై నెగిటివ్ కామెంట్ చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాడు యాంకర్ రవి.
ఇక ప్రస్తుతం అసలు విషయంలోకి వస్తే నిత్య ఇంస్టాగ్రామ్ ద్వారా తన కూతురు కి సంబంధించి ఒక డాన్స్ వీడియో ని పోస్ట్ చేసింది.. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.. ఇక ఈ వీడియోలో రవి కూతురు వీయా ఎంతో క్యూట్ గా డాన్స్ వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటూ వస్తోంది.. రవి అభిమానులు తన కూతురు డాన్స్ చూసి ఇమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో మాధ్యమిక లో తెగ వైరల్ గా మారుతుంది.. ఇక యాంకర్ రవి ప్రస్తుతం కొన్ని షో ల కే పరిమితమై చేస్తున్నాడు.ఏది ఏమైనా రవి కూతురు డాన్స్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: