టీవీ:తీన్మార్ సావిత్రి పై కామెంట్స్ వైరల్..!!

Divya
బుల్లితెరపై నటిస్తున్న నటులలో తీన్మార్ సావిత్రి అనే పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన మాటలతో తెలంగాణ ప్రేక్షకులను సైతం మైమరిపించేలా చేస్తూ ఉంటుంది. ఇక దీంతో ఈమె ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. మొదటిసారిగా v6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయింది. తను ఈ ప్రోగ్రాం లో మాట్లాడే మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక సావిత్రి తో పాటు బిత్తిరి సత్తి కూడా తన చేష్టలతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇక సావిత్రి ఎప్పుడు తనని తమ్ముడు అంటూ పిలుస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
వీరిద్దరూ చేసే కామెడీ వల్ల తీన్మార్ వార్తలు రేటింగ్ లో మొదటి స్థానంలో ఉండేది. అయితే సావిత్రి అసలు పేరు మాత్రం శివ జ్యోతి.. ఇక ఈమె పుట్టింది తెలంగాణలో నిజామాబాద్ జిల్లా నాగంపేట ప్రాంతంలో జన్మించింది .. ఇక సావిత్రికి గంగోలి అనే వ్యక్తితో వివాహం కూడా అయ్యింది. ఇక యాంకర్ గా బాగా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఎన్నో చానల్స్ లో యాంకరింగ్ గా పని చేసింది. తన కెరియర్ ప్రారంభంలో తను మాట్లాడే భాష వల్ల, గొంతు వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నదట.. అలాంటి సమయంలోనే న్యూస్ ఛానల్ అయినటువంటి v6 ఛానల్ వారు.. తమ చానల్లో యాంకరింగ్ చేసేందుకు తెలంగాణ భాష వారిని ప్రకటించగా.. అందుకు ఈమె సెలెక్ట్ అయ్యాను అని తెలియజేసింది.
అలా పాపులర్ అయిన తర్వాత ఈమెకు బిగ్ బాస్ షోలో కూడా అవకాశం వచ్చిందని తెలియజేసింది. బిగ్ బాస్ హౌస్ షో బాగా ఎమోషనల్ షో అని సావిత్రి అప్పట్లో తెలియజేసింది. ఇక ఆ తర్వాత tv-9 ఛానల్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం సావిత్రి అక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కువ గ్లామర్ ను ప్రదర్శించడంలో ముందుంటోంది. ప్రస్తుతం ఈమె వేసుకున్న బట్టల ను చూసి తట్టుకోలేక పోతున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: