టీవీ: స్టార్స్ నే మించిపోయిన దుర్గారావు వీడియో వైరల్. !!

Divya
 సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికున్న టాలెంట్ ను కాస్త ఉపయోగించి ఒక వీడియో ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది ఒకప్పుడు టిక్ టాక్ యాప్ ను ఉపయోగించి ఎంతోమంది వీడియోలు చేసేవారు. ఇక ఈ యాప్ ద్వారా.. ఎంతోమంది పాపులర్ అయ్యారు అని చెప్పవచ్చు.. అందులో టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరు. అయితే తాజాగా ఇప్పుడు ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకుందాం.
అయితే తాజాగా టిక్ టాక్ యాప్ బ్యాన్ కావడంచేత.. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నారు. టిక్ టాక్ యాప్ లో భారీ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు దుర్గారావు తన భార్య.. దుర్గారావు తన భార్యతో కలిసి వేసిన స్టెప్పులు నెటిజన్లను బాగా ఆకట్టుకోవడంలో ముందు వరుసలో ఉంటాయి. తాజాగా వీరిద్దరూ కలిసి పుష్ప సినిమాలోని ఒక డైలాగ్ చేయడం ద్వారా అది ఇప్పుడు వైరల్ గా మారుతోంది.. పుష్ప సినిమాలోని ఉండే డైలాగులను వరుస పెట్టి ఈ వీడియోలో చూపించడం జరిగింది.. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది.ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజనులు కామెంట్ రూపంలో వీరిని బాగా ఆడుకుంటున్నారు.
మరికొంత మంది నెటిజన్లు మాత్రం బాగానే చేశారంటూ తెలియజేస్తున్నారు.. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారంటూ కామెంట్ చేయడం జరుగుతోంది. మరికొంతమంది మాత్రం ముందు ఈ వీడియోను డిలీట్ చేయండి అంటూ కామెంట్ చేశారు. అప్లోడ్ చేసిన రెండు రోజుల తర్వాత.. ఈ వీడియోకు 17000 లైకులు రావడం గమనార్హం. అయితే వీరుఎలాంటి కామెంట్స్ ని పట్టించుకోకుండా సరికొత్త కొన్ని వీడియోలను చేస్తూ విడుదల చేస్తూ ఉన్నారు.
View this post on InstagramA post shared by Tiktok Durgarao Official (@tiktok_durgarao_official)

' data-card-branding='0' class='embedly-card">">