పెళ్లితో ఒక్కటి కానున్న సీరియల్ హీరో హీరోయిన్ లు?

VAMSI
ఓ ప్రముఖ సీరియల్ హీరోయిన్ అదే సీరియల్ లో నటిస్తున్న హీరో ప్రేమలో పడిందట. మొదట్లో కో యాక్టర్స్ గా మొదలయిన వారి పరిచయం ఇపుడు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిందట. త్వరలో ఆ ఫేమస్ సీరియల్ హీరో, హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని సమాచారం. త్వరలోనే వారి పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఒకే సీరియల్ లో చాలా కాలం నుండి నటిస్తున్న వీరిద్దరికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందట. బుల్లితెరపై సక్సెస్ఫుల్ జంటగా పేరు తెచ్చుకున్న ఈ కపుల్ ఇపుడు రియల్ లైఫ్ లో కూడా ఒకటై విజయవంతంగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇరువురి ఇంటిలోనూ ఈ విషయం పై పెద్దల మధ్యన చర్చలు జరుగుతుండగా వన్స్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ విషయాన్ని ఫ్యాన్స్ కు మరియు సన్నిహితులకు చెప్పి ఆనందాన్ని పంచుకోవాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది ఆ జంట. చాలామంది సెలబ్రిటీలు అదే ఫీల్డ్ ఉండే వారినే పెళ్లి చేసుకుంటుంటారు. మొదట్లో వారితో ఏర్పడిన పరిచయాలు, వారి అభిరుచులు దగ్గరవడం, వారి మద్య బంధం మరింత బలపడటం వంటివి వారిని ఒకటయ్యేలా చేస్తాయి. చాలా మంది సెలబ్రిటీలు ఇలా వివాహ బంధంతో ఒకటయ్యారు. సీరియల్ నటులు కూడా చాలా మంది ఇలాగే అదే ఫీల్డ్ లో ఉన్న వారిని వివాహం చేసుకున్నారు.
సినీ  తారలకే కాదు సీరియల్ నటులకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. మంచి అభినయం ఉండాలే కాని మన తెలుగు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఇక వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. మరి వీరిద్దరి మొదలైన ఈ బంధం పెళ్లితో ఒక్కటవుతుందా లేదా ప్రేమతోనే సరిపెట్టుకుంటారా అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: