బిగ్ బాస్ 5: నామినేషన్ లో థ్రిల్ మిస్... వాట్ బిగ్ బాస్ ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మహా సంగ్రామం మొదలయ్యింది. టాప్ ఫైవ్ లో నిలిచే వ్యక్తుల కోసం పోటీ హోరా హోరిగా సాగుతోంది. అలాంటప్పుడు సోమవారం అంటే ఎలా ఉండాలి. ఎలా ఉంటుందని ఎక్ష్పెక్ట్ చేస్తాం..!! కానీ ఈ సారి ఆ రిధం మిస్స్ అయ్యిందనే చెప్పాలి. మాములుగానే సోమవారం అంటే హౌజ్ లో రచ్చ మామూలుగా ఉండదు. నామినేషన్ ప్రక్రియతో హౌజ్ దద్ధరిల్లి పోతుంది. ఈ ఇంట్లో ఉండటానికి మీకు అర్హత లేదంటే, మీకు లేదని ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. కాగా నిన్న జరిగిన సోమవారం ఎపిసోడ్ లో ఈ ఫైట్ మరింత ఎక్కువగా ఉంటుందని అంతా ఊహించారు. ఎందుకంటే ఈసారి నామినేట్ అయ్యి బయటకు వెళ్లాల్సి వస్తే అది మామూలు విషయం కాదు...చేతికందిన ముద్ద నోటికి అందకుండా పోవడమే అవుతుంది.
అదేనండి ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చి  టాప్ ఫైవ్ లో ఒకరం అని పేరు లేకుండానే ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోతే ఎలా ఉంటుంది. కాగా ఈ సోమవారం నామినేట్ అయిన వారిలో  ఒకరు ప్రజల ఓటింగ్ ను బట్టి ఇంటి నుండి ఔట్ అవుతారు. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ కోసం 1,2,3,4,5,6 రాంక్ లను పెట్టి ఎవరు ఏ స్థానం వద్ద అర్హులో వారినే నిర్ణయించుకొని అయా స్థానాల వద్ద నిల్చోమని చెప్పారు. మామూలుగా గత సీజన్ల లో   అప్పుడు కూడా ఇలాంటి గేమ్ నడిచింది. అపుడు మొదటి 1,2,3 స్థానలలో నిల్చోవడానికి తాము అర్హులమని రచ్చరచ్చ చేసే వారు. కొన్ని సార్లు చివరి వరకు వడించుకుంటూనే అందరూ నామినేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇపుడేమో సీజన్ ఫైవ్ లో మిగిలిన ఆరు సభ్యులు ఎదో ఆడాలంటే ఆడాలి అన్నట్టుగా ఆడారు. ఈ స్థానాల్లో మనల్ని నిలబెట్టేది ప్రజలు. మనం అనుకుంటే సరిపోదు అంటూ భారీ డైలాగులతో  స్ట్రాటజీలను ఉపయోగించేశారు. ఒక్క కాజల్ తప్ప మిగిలిన వారు నువ్వా నేనా అన్న పోటీ లేకుండానే  ఎక్కడో అక్కడ నిలుచున్నారు. చివరికి బిగ్ బాస్ ఏమో టికెట్టు ఫినాలే అందుకున్న  శ్రీ రామ చంద్ర తప్ప మిగిలిన వారంతా నామినేట్ అయ్యారు అని షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: