బిగ్ బాస్ 5: వీరిద్దరూ మారరా... మళ్ళీ 'హగ్గులు' మొదలెట్టిన సిరి

VAMSI
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి గ్లామర్ పెంచింది ఒక్క సిరి అనే చెప్పాలి. ఈమె బిగ్ బాస్ హౌజ్ లోకి రాక ముందు వెబ్ సిరీస్ లో చేశారు. అంతేకాదు పలు సీరియల్స్ లోనూ నటించింది. 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్ లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక అందాలను వలకబోస్తున్న ఈ బామ షణ్ముఖ్ జస్వంత్ తో చాలా కనెక్ట్ అయ్యింది. అసలు హౌజ్ లో అందరూ ఓ లెక్క ఈ జంట మాత్రం మరో లెక్క అన్నట్టుగా ఉంది. అబ్బో వీరిద్దరి రొమాన్స్ ఎపుడో హద్దులు దాటేసింది లెండి. మరీ అంత దారుణం అని చెప్పలేము కానీ ఎందుకంటే గతం లో కూడా బిగ్ బాస్ హౌజ్ లో ఇంతకుమించి చూశాం.
కానీ ఇక్కడ షన్ను కి ప్రాణం కంటే ఎక్కువైన తన ప్రియురాలు దీప్తి సునైన ఉంది, మరి సిరికి ఏమో ఇప్పటికే చోటుతో యంగేజ్మెంట్ అయిపోయింది. ఇలా వీరిరువురు గురించి జనాలకు ఓ క్లారిటీ ఉన్న సమయంలో వీరు ఇలా తెలిసి తెలిసి అది యాక్టింగ్ అయినా నిజమైనా మరీ ఇంత క్లోజ్ గా ఉండటం చూడలేకపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే మొన్న అటు సిరి వాళ్ళ అమ్మ సిరికి దూరంగా ఉండమని షన్నుకి గట్టిగానే చెప్పింది. ఇటు షన్ను వాళ్ళ అమ్మ కూడా సిరిని షన్నుకి దూరంగా ఉంటూ ఎవరి గేమ్ వాళ్లు ఆడుకోవడం మంచిది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కానీ అదేంటో కానీ... ఈ అయస్కాంతాలు మాత్రం అస్సలు అలా ఉండలేకపోతున్నాయి.
అంత జరిగిన కొద్ది గొప్పో షన్ను దూరంగా ఉండాలని ప్రయత్నించినా సిరి మాత్రం హగ్గులతో మళ్ళీ విషయాన్ని మొదటికి తెస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో షన్నును ఎందుకు సారీ చెప్పమందో తెలియదు కానీ.... సారీ చెప్పించుకుని మరి మళ్ళీ తనకి గట్టి హగ్ ఇచ్చింది. షన్ను వద్దంటూ వెనక్కి వెళుతున్న బ్రతిమలాడి మరి హగ్ ఇచ్చేసింది. మరి వీరి స్టోరీ ఎంటనేది ఎవరికి అర్దం కావడం లేదు. ఈ మధ్య స్టేజ్ పై చోటు కనిపిస్తే అంత ఎమోషనల్ అయ్యి ఎంతో మిస్ అయినట్టు ఫీల్ అయిన సిరి మళ్లీ షన్ను తో ఏంటిది అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: