టీవీ: ఇన్నాళ్లకు తన కలను నెరవేర్చుకున్న విశ్వ..!!
ఇకపోతే తాజాగా విశ్వా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.. ఉన్నట్టుండి సడన్ గా ఇంత లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో అందరూ షాక్ అవడం గమనార్హం.. బీఎండబ్ల్యూ అంటే చాలా రేంజ్ లో వున్న కారు.. ఈ రేంజ్ లో ఉన్న కారును కొన్నాడు అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ నుంచి వచ్చిన పారితోషికం తోని కొనుగోలు చేసి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి మనం కన్న కలలు నెరవేరితే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.
విశ్వ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కన్న కారును కొనడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. అంతే కాదు నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను అంటూ.. మా కుటుంబం లోకి ఒక కొత్త నెంబర్ వచ్చిచేరింది అంటూ.. దీనంతటికీ కారణం ఆ దేవుడు అలాగే బిగ్ బాస్ షో అంటూ విశ్వ బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకోవడం తో పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.