టీవీ: ఈ ఫోటోలో ఉన్న ముద్దులొలికే చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

Divya
గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా ను సెలబ్రిటీలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడని సెలబ్రిటీలు, కరోనా సమయంలో ఏం చేయాలో తెలియక తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి సిద్ధం అయ్యారు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వారు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రోజంతా ఏ పనులు చేస్తారు.. ఎలాంటి భోజనం చేస్తారు ఇలా ప్రతి విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు..అయితే కరోనా సమయంలో వీరు చేసిన పనులే ఇప్పుడు వారికి అలవాటుగా మారిపోయాయి..

ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోలు, హీరోయిన్లు , యాంకర్లు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తన చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఇక వీరు తమ చిన్ననాటి ఫోటోలను , వీడియో లను షేర్ చేస్తూ ఉండడం వల్ల వారి అభిమానులు వీటిని భద్రంగా దాచుకుంటూ మురిసి పోవడమే కాకుండా లైక్, కామెంట్ చేస్తూ తమకు నచ్చిన వారికి కూడా షేర్ చేస్తూ ఉంటారు. అభిమానులు ఇలా తమకు నచ్చిన వారికి ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం వల్ల అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వుంటాయి.

ఈ నేపథ్యంలోనే ఒక అందాల తార , ముద్దు గుమ్మ  యాంకర్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చిన్ననాటి ఫోటో లో ఆమె చాలా బుద్ధిగా, బొద్దుగా  కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి.. శ్రీముఖి బుల్లితెర మీదే కాదు పలు సినిమాలలో కూడా ముఖ్యంగా  స్టార్ హీరోల సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ ఉండే  శ్రీముఖి ఈ మధ్య తన చిన్ననాటి ఫోటో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: