కృష్ణ తులసి సీరియల్ ఆనంద్ భూపతి వర్మ రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ఈమధ్య ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ లో కేవలం కొత్త నటీనటులు మాత్రమే కాదు సీనియర్ నటీనటులు కూడా నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతూ ఉండడం గమనార్హం.. ఇకపోతే కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి టీవీలో సీరియల్స్ కి ఎటువంటి డోకా లేదు.. సినిమాలను తలపించే రీతిలో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సీరియల్స్ వస్తుండడం గమనార్హం. ఇప్పటివరకు స్టార్ మా ఛానల్ లోనే సీరియల్స్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అంటే మరో పక్క జీ తెలుగు సీరియల్స్ కూడా ప్రేక్షకులకు కనువిందు చేయడానికి పోటీ పడుతున్నాయి.
ఇకపోతే జీ తెలుగులో విజయవంతంగా ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ తులసి. ఈ సీరియల్ లో నటీనటులు తమ నటనతో మంచి పాపులారిటీని తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా పొందుతున్నారు. ముఖ్యంగా కృష్ణ తులసి సీరియల్ లో హీరోగా నటిస్తున్న అఖిల్ కి తండ్రి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్న ఆనంద్ భూపతి వర్మ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈయన అసలు పేరు జే.ఎల్. శ్రీనివాస్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కామేశ్వరి -  రామయ్య దంపతులకు ఆయన జన్మించారు.
వీరి తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్ కాగా తల్లి గృహిణి.. శ్రీ రామకృష్ణ విశ్వవిద్యాలయంలో జేఎల్ శ్రీనివాస్ స్కూల్ విద్యను పూర్తి చేయగా, లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఇక రేవతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న ఈయనకు, సంతోష్ ,మానస అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక ప్రస్తుతం ఈయన గృహలక్ష్మి, కృష్ణ తులసి వంటి సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నారు. అయితే అప్పట్లో చదువు పూర్తయిన వెంటనే కమల్ హాసన్ హీరోగా స్వాతిముత్యం సినిమాలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకుని, ఆ తర్వాత కమల్ హాసన్ కు కొడుకు పాత్రలో చేసిన శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
40 సినిమాలకు పైగా నటించిన ఈయన  మంచి డాన్సర్ కూడా.. ఎన్నో స్టేజ్ షోలను ఇచ్చి బహుమతులు కూడా అందుకున్నాడు. శివుడి పాత్రలో లీనమై నటిస్తాడు. శశిరేఖా పరిణయం, కోయిలమ్మ , అన్వేషిత, విధి, పెళ్లి పుస్తకం, బంగారు గాజులు వంటి  సీరియల్స్  లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: