టీవీ: నా పేరు మీనాక్షి సీరియల్ చతుర రియల్ లైఫ్ స్టోరీ..!
చతుర అసలు పేరు అన్షు రెడ్డి. జనవరి 29వ తేదీన సిద్దిపేట జిల్లా చేర్యాల లో జన్మించింది. అన్షు రెడ్డి తెలుగు అమ్మాయి.ప్రస్తుతం వీరి కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోనే నివసిస్తోంది. అన్షు రెడ్డి కి ఒక అన్నయ్య, ఒక అక్క కూడా ఉన్నారు. అన్షు రెడ్డి అక్క పేరు అమూల్య రెడ్డి. సీరియల్ నటిగా అందరికీ సుపరిచితురాలు. ఇక ఈమె ఇండస్ట్రీ ప్రవేశ రంగం ఎలా చేసింది అంటే.. డిప్లమా థర్డ్ ఇయర్ లో చదివేటప్పుడు ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళా షో కి తన అక్క అమూల్య రెడ్డి తో కలిసి పార్టిసిపెంట్ గా హాజరయ్యింది.
ఈ షోకి హాజరైన మరికొద్ది రోజుల్లోనే ఈమెకు ఈటీవీ లో ప్రసారం అయిన భార్యామణి సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ లో కూడా తన అక్కతో కలిసి నటించిన ఈమె ఆ తర్వాత సోలోగా గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలు, సూర్యవంశం, అష్టా చమ్మ, కలలో రాజకుమారి వంటి సీరియల్స్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్షురెడ్డి. ప్రస్తుతం అన్షు రెడ్డి నా పేరు మీనాక్షి సీరియల్ నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.