బిగ్ బాస్ 5: నామినేషన్స్ లో ప్రియా సన్నీ రచ్చ

VAMSI
బిగ్ బాస్ హౌజ్ లో సోమవారం వచ్చింది అంటే చాలు విషయం బిగ్ బాస్ లవర్స్ కు తెలిసిందే, అప్పటి వరకు అంతా ఎలా ఉన్నా ఒకరినొకరు రీజన్ చెప్పి నామినేషన్ చేయాలి అని అంటే చాలు ఇక ఇల్లు మొత్తం వారి గొడవలతో రసాభాసగా మారుతుంది. కొందరు సిల్లీ రీజన్స్ చెబుతున్నారు అంటూ టార్గెట్ చేస్తే ఇంకొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ విరుచుకుపడతారు. ఇంకొందరు మొదటి వారం విషయాన్ని కూడా గుర్తుచేసి దానివల్లే నిన్ను నామినేట్ చేస్తున్నా అనే మహానుభావులు కూడా ఉన్నారు లెండి. మరి ఎంతో సీరియస్ అయిన నామినేషన్స్ లో ఇలాంటి రీజన్స్ చెబితే అవతలి వారు ఊరుకుంటారు. అందుకే సోమవారం వచ్చిందంటే చాలు ఇంట్లో ఒకరిపై ఒకరు కత్తులు నూరుతుంటారు.
ఇంటి సభ్యుల మధ్య జరిగిన వివాదాలతో హౌజ్ టాప్ లేచిపోతుంది. అయితే నిన్నటి సోమవారం ఎపిసోడ్ లో మరింత హిట్ డోస్ పెంచారు బిగ్ బాస్. అగ్గికి ఆర్జ్యం పోసినట్టు సోమవారం అంటేనే మాములుగానే నామినేషన్ ప్రక్రియతో ఒకరిపై ఒకరు కోపంతో ఊగిపోతుంటారు. అలాంటిది ఈసారి ఒక గేమ్ పెట్టి మరి ఈ రోజు ఇంకాసేపు ఎక్కువగా నామినేట్ చేసుకుంటూ కొట్టుకు ఏడవండి అన్నట్టుగా వేటగాడు అనే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గేమ్ ఆడుతూ తమకు నచ్చని వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎదుటి వారు కాసేపు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి ఎదుటి వారు ఒప్పుకుంటే తమని తాము నామినేషన్ నుండి రక్షించుకోవచ్చు.  అలా వేటగాడు, కోతుల  టాస్క్ మొదలయ్యింది. నామినేషన్స్ వేడి హౌజ్ మొత్తం హీటెక్కించింది.
సిరి యాని మాస్టర్ ని నామినేట్ చేయగా..యాని మాస్టర్ తిరిగి సిరిని నామినేట్ చేసింది. యాంకర్ రవిని ప్రియా చాలా సిల్లీగా నువ్వు రోజు సోఫాపై టవల్ వేయడం నాకు నచ్చడం లేదు అంటూ  నామినేట్ చేసింది. దాంతో పింకీకి కోపం వచ్చి మరీ ఇంత సేఫ్ గేమ్ ఆడొద్దు అంటూ చేతిలో ఉన్న అరటిపండు విసిరికొట్టి అంతా ఫేక్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక సన్ని ఏమో మళ్ళీ రవి ను నామినేట్ చేయగా ...నేను ఆరు వారాల నుండి నామినేషన్ లో ఉన్నానంటూ నామినేట్ చేయొద్దని బ్రతిమిలాడాడు. అలా నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ లో కారాలు మిరియాలు బాగా దట్టించారు ఇంటి సభ్యులు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: