టీవీ: ఆయనతో చల్లగా చీర్స్ కొడుతూ రచ్చ చేస్తున్న అనసూయ..!

Divya
అనసూయ భరద్వాజ్ సినీ ఇండస్ట్రీలో గొప్ప నటిగా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి యాంకర్ గా కొనసాగుతోంది. తన భర్త శశాంక్ భరద్వాజ్ ను ఇంటర్ చదువుతున్న వయసు నుంచి ప్రేమించిన విషయం తెలిసిందే.. అతనినే వివాహం కూడా చేసుకుంది. ఇకపోతే అనసూయ భరద్వాజ్ తన భర్త అయిన సుశాంక్ భరద్వాజతో ఈమె చేసే అల్లరి , ఆడే సరసాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే..ఎందుకంటే ఈమె ఆ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది..
ముఖ్యంగా పడక గదిలో చేసే ముద్దులాట కూడా ఈమె పబ్లిక్ గానే చేస్తూ ఉంటుంది. తన భర్త తో ఉండే ఫోటోలను ఆమె పబ్లిక్గానే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. ఈ జంట చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఒక మహిళ ఇంత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆమె భర్త భరద్వాజ్ ఎంతగా సహకరిస్తున్నాడో మనం ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అనసూయ ఎప్పటికప్పుడు తన సక్సెస్ వెనక ఆమె భర్త సుశాంత్ భరద్వాజ్ ఉన్నాడు అని చెబుతూ ఉంటుంది.
ఇకపోతే తాజాగా అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ బర్త్డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె తన పిల్లలతో, తన భర్త తో కలిసి చేసే సందడి అంతా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ, తాజాగా తన భర్తతో కలిసి ఏదో ఒక ఎనర్జీ ద్రావణాన్ని చీర్స్ చెప్పుకుంటూ తాగేస్తున్నారు. ఈమె డైట్ చేయడంతో పాటు తన భర్తతో కూడా డైట్ చేయిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా వీళ్లు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అనసూయ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతూ మంచి పొజిషన్ అనుభవిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ నటిగా గుర్తింపు పొందడానికి కూడా సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: