టీవీ: జబర్దస్త్ తెరముందు.. తెరవెనుక ఎలా ఉంటుందో తెలుసా..?

Divya

జబర్దస్త్ కామెడీ షో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో అని చెప్పవచ్చు. అయితే ఇది కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కామెడీ షో మాత్రమే కాదు ఎంతో మంది నిరుపేదలకు తల్లిగా అండగా నిలిచింది జబర్దస్త్. నిజంగా జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాను మొదలుకొని సుధీర్, రష్మీ, రాంప్రసాద్ , నరేష్ ఇలా  ఎంతోమందికి జీవనాన్ని అందించింది. ఇకపోతే ఈ జబర్దస్త్ షో లో ఈమధ్య తెలుగు అభిమానులకు పరిచయమైన ఒక టీం మెంబర్ అయిన ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఈమె ఒక వినూత్న మైన స్లాంగ్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ, మంచి అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఈమె టీం లీడర్ భాస్కర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అవి ఎంటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. భాస్కర్ అన్న ఎలా ఉంటారు అంటే.. జబర్దస్త్ స్టేజ్ పై చేసేటప్పుడు కూడా నేను నిన్ను ఇలాగే తిడతాను అని అంటే, అప్పుడు భాస్కర్ అన్న అడుగుతావేంటి అమ్మ ఏమన్నా తిట్టు అని అంత ఫ్రీడం మాకు ఇచ్చాడు అని తెలిపింది.. మేము ముందే అనుకున్న ప్రకారం స్కిట్  స్టేజీపైన అసలు వెళ్ళదు.. ఒక్కోసారి అనుకోకుండా మధ్యలో  ఎవరైనా కల్పించుకుంటే ఇక అంతే వేరేలా వెళ్లి పోతుంది అని తెలిపింది ఆమె..

భాస్కర్ అన్న స్కిట్ లో కామెడీతో పాటు కథ కూడా ఉంటుంది.. జస్ట్ కొన్ని కీ పాయింట్ తీసుకొని కేవలం స్కిట్  తయారు చేస్తారు.. అయితే ఆ స్కిట్ కి స్టార్టింగ్, మిడిల్,  కంక్లూజన్ అన్నీ ఉంటాయి అని తెలిపింది. అంతేకాదు మధ్యలో నీకు నచ్చింది నువ్వు మాట్లాడు వాళ్ళు నవ్వినా లేకపోయినా నీ ప్లానింగ్ తోనే వాళ్ళని కడుపుబ్బా నవ్విస్తావు.. ఒకవేళ వాళ్ళు నవ్వారు అంటే దాన్ని మరింత చేసుకొని ప్రేక్షకులను నవ్వించు అంటూ బాగా ఎంకరేజ్ చేస్తారు అని కూడా ఆమె తెలిపింది. సుధీర్ అన్న టీమ్ వాళ్లు కూడా చాలా బాగా చూసుకుంటారు అని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: