బిగ్ బాస్ సీజన్-5 అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. మూడో వారంలో సోమవారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగినట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదల కాగా ఇంటి సభ్యులంతా ఫైర్ మీద ఉన్నారు. అయితే ఈ సారి బిగ్ బాస్ తాము నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ పేరును పలక పై రాసి బద్దలు కొట్టే విధంగా ఏర్పాటు చేశాడు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ వచ్చి బద్దలు కొడుతూ నామినేట్ చేస్తున్న వారి గురించి తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక నామినేషన్ టైమ్ వచ్చిందంటే ఇంటి సభ్యులు ఏ రేంజ్ లో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకూ క్లోజ్ గా మాట్లాడుకున్న వాళ్లు కూడా నామినేషన్ టైం వచ్చిన తరవాత గొడవలకు రెడీ అవుతారు.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరూ తాము నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ పేర్లను కుండ బద్దలు కొడుతూ బయటపెట్టారు. యాంకర్ రవి మోడల్ జెస్సీ తో ఇంకా ఎన్నిరోజులు చిన్న షార్ట్స్ వేసుకుని ఆ గాయాన్ని చూపిస్తూ సింపతీ కోసం ప్రయత్నిస్తావంటూ నామినేట్ చేశాడు. ఇక ఎప్పుడు ప్రియాతో జరిగిన గొడవను గుర్తు చేస్తూ సన్నీ నామినేట్ చేశారు. గత వారం టాస్క్ సంధర్భంగా నువ్వు మగాడివైతే రా అంటూ ప్రియా సన్నీని పై అరిచిన సంగతి తెలిసిందే.
దానికి మీరు అన్న పదం నచ్చలేదని చెప్పి సన్నీ నామినేట్ చేశారు. దాంతో సేఫ్ గేమ్ అడుతున్నావ్ అంటూ సన్నీపై ప్రియా మండి పడింది. ఇక ప్రియాంక సింగ్ ఎవరిని అంటుందో అర్థం కాలేదు కానీ చిన్న చిన్న రీజన్ లు చెప్పి నామినేట్ చేయొద్దంటూ మండి పడటం కనిపిస్తోంది. ఇక ప్రియాంక సింగ్ ను లోబో నామినేట్ చేయడం ప్రోమోలో కనిపిస్తోంది. అంతే కాకుండా మానస్ ను మరోసారి శ్రీరామ్ చంద్ర నామినేట్ చేశారు. ఇక లాస్ట్ లో జెస్సీని నువ్వు చిన్న పిల్లాడివి అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పడంతో మరోసారి జెస్సీ కంట్రోల్ తప్పినట్టు కనిపిస్తోంది.