బిగ్ బాస్ 5: ఆ తప్పు సన్నీ చేయలేదని ప్రూవ్ చేసిన నాగ్

VAMSI
బాబోయ్ నిన్న శనివారం బిగ్ బాస్ హౌస్ లో షంటింగ్ మామూలుగా లేదు. సారీలతో హౌజ్ లో రీసౌండ్ మారుమోగింది. ఒక్క మాటలో చెప్పాలంటే హోస్ట్ నాగ్ విశ్వరూపం చూపించాడు. తన ఆగ్రహాన్ని ఎలా చూపించారంటే పలుకు సున్నితంగానే ఉన్నా పదం నేరుగా బాణంలా కంటెస్టెంట్ ల గుండెల్లోకి దూసుకుపోయింది. హౌస్ లో కొందరికి నాగ్ ఇచ్చిన క్లాస్ బాబోయ్ అనేలా ఉంది. ఈ శనివారం అంతా ఫటాఫట్ ధనాధన్, ఇంటి సభ్యులను రఫ్ ఆడించేశారు నాగార్జున. ప్రేక్షకులు నాగ్ ని మీరు సూపర్ బాస్ తప్పు చేస్తే దండన తప్పని సరి. మీరు సరిగ్గా చేశారు అంటూ పొగిడేశారు. కొందరు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది అంటూ ఆనందించారు. ఇంతకీ అసలు నిన్న జరిగిన విశేషాలేంటో తెలుకుందాం పదండి. మొదట సందడిగానే మొదలైనా..ఆ తర్వాత గత వారం బిగ్ బాస్ ఇంట్లో జరిగిన గొడవలను ఉద్దేశించి నాగ్ ప్రస్తావించడం మొదలెట్టాడు. మీరు ఏం తప్పులు చేశారో, ఎలా ఇతరులను కించ పరిచారో మీకే తెలుసు. కాబట్టి నేను అడుగక ముందే మీరే నిల్చుని మీ తప్పులను ఒప్పుకుంటే బాగుంటుంది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

దాంతో మొదట ఉమా దేవి, శ్వేత వర్మ, యాని మాస్టర్, సన్నీ, శ్రీ రామచంద్ర, సిరి, లోబో లేచి నిల్చున్నారు. ఒక్కొక్కరిగా మీ తప్పులు ఏంటో మీరే చెప్పండి అని నాగ్ వారిని అడుగగా... ముందుగా ఉమా దేవి తన తప్పును ఒప్పుకుంది. టాస్క్ సమయంలో , నామినేషన్ సమయంలో కొందరిని ఆవేశంతో దుర్భాషలాడాను, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాను ముఖ్యంగా యాని మాస్టర్ ని ఎక్కువగా బాధ పెట్టాను అంటూ యాని మాస్టర్ కి సారీ చెప్పింది. ఆ తర్వాత బాణాన్ని శ్వేత పైకి ఎక్కుపెట్టారు నాగ్. నువ్వే చెప్పమ్మా శ్వేత అనగానే తను హమీదాను రంగుతో నామినేట్ చేస్తూ గట్టిగా ముఖంపై కొట్టడం తప్పని ఒప్పుకుంది. అలాగే లోబోని కూడా, అపుడు నాగ్ ఆ తప్పుకు శిక్ష ఏమిటో నువ్వే డిసైడ్ చై అనగా...వెంటనే శ్వేత తన రెండు చేతులతో గట్టిగా తన ముఖంపై కొట్టుకుని ఏడుస్తూ అందరికీ సారీ చెప్పింది. ఇక సిరి ....సన్ని పై తన టీ షర్ట్ లో చేయి పెట్టీ పిల్లో తీసాడని నింద వేయగా అప్పటి వీడియోని ప్లే చేశారు. అందులో చాలా క్లియర్ గా శ్వేత ఆ క్లాత్ తీసినట్లు ఉంది దాంతో సన్నిని క్షమించమని అడిగింది.

అందుకు నాగ్ పూర్తిగా విషయం తెలియకుండా ఎదుటి వారి క్యారెక్టర్ ను తప్పు పట్టడం చాలా పెద్ద తప్పు అంటూ ఇంకెప్పుడూ ఇది రిపీట్ కాకూడదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనితో సన్నీ ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలో హీరో అయ్యాడు. ఇక యాని మాస్టర్ మీరు ఉమాదేవిని ఆ సమయంలో ఎదిరించడం తిరిగి మాట్లాడటం అనివార్యం. మీరు కరెక్టే చేశారు అని  కూర్చోమన్నారు. ఇక శ్రీరామ్ ని నువ్వు కరెక్ట్ సంచాలకుడు అంటే నిర్ణయాన్ని తానే తీసుకోవాలి చర్చ పెట్టకూడదు. సో నువ్వు మానస్ ను అదే మాట అనడంలో తప్పులేదు అని అభినందించి కూర్చోమన్నారు. మొత్తానికి ఉమాదేవికి, శ్వేతకి, సిరికి హౌస్ లో వారు చేసిన తప్పులకు నాగ్ కాస్త గట్టిగానే గడ్డి పెట్టారు. అయితే ఈ రోజు హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉమాదేవి ఇంటిని వీదనున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: