బిగ్ బాస్ 5: ఆఖరికి కాజల్ ను పనిమనిషి చేసేశారే ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 కంటిస్టెంట్ల మధ్య ప్రేమాయణం పై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు శ్రీ రామ్ ఇంకా హమీదా లవ్ బర్డ్స్, జస్ట్ క్రష్ మాత్రమే అనుకున్నాం కానీ వారి మనసులో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వరకు వెళ్ళింది విషయం. అది నిన్నటి ఎపిసోడ్ క్లియర్ కట్ గా బయటపడింది. నిన్నటి ఎపిసోడ్ లో రవి, కాజల్ తో బీబీ న్యూస్ ద్వారా ఇంట్లో జరిగే విషయాలు చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. ఎవరి మనసులో నిజంగా ఉన్నది ఎవరు వారి పేరు ఎవరికీ అన్న విషయం ఈ ఎపిసోడ్ లో క్లియర్ గా బయట పడిపోయింది మరి. ఈ టాస్క్ లో భాగంగా రవి మరియు కాజల్ లు అందరినీ అడుగుతూ శ్రీరామచంద్రను కూడా ఇంట్లో ఉన్న ఆడవారిలో లవర్, భార్య, పనిమనిషి గా మీకు ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోరారు. అందుకు శ్రీరామ్ ఎవరూ ఊహించని ఆన్సర్ తో వారికి షాక్ ఇచ్చాడు. 
నాకు లవర్ గా అయితే హమీదా అయితే బాగుంటుంది. ఇక లైఫ్ లాంగ్ తోడు ఉండే  భార్య మాత్రం ప్రియ గారు మరియు లహరి గారు అయితే సరిగా జాగ్రత్తగా చూసుకుంటారు అని తెలివిగా సమాధానం చెప్పాడు. పక్కనే ఈ మాటలు వింటున్న ప్రియ షాక్ అయింది. కానీ లహరి మాత్రం శ్రీరామ్ చెప్పిన మాటలను ఎంజాయ్ చేసింది. ఇక పని మనిషిగా కాజల్ పేరు చెప్పాడు.  తన మనసులో హమీదా కి లవర్ వరకు మాత్రమే స్థానమిచ్చి భార్యగా ప్రియ, లహరి ల పేర్లు చెప్పడంతో హమీదా పై తనకున్నది కేవలం క్రష్  నే నని చెప్పకనే చెప్పేశాడు శ్రీ రామ్.
ఇక పనిమనిషి గా కాజల్ పేరు చెప్పడం తో ఫన్ క్రియేట్ అయింది. కాజల్ మనసులో ఏమైనా బాధపడిందో ఏమో గానీ బయటకు మాత్రం  సరదాగానే తీసుకున్నట్టు మాట్లాడింది. అయితే హౌస్ లో అడిగిన వారిలో దాదాపు ఎక్కువ మంది మగవారు కాజల్ ను పనిమిషగానే అన్నారు. దీనితో కాజల్ కాస్తా ఫీల్ అయింది అని తెలిసింది.
ఇలా ఇంటి సభ్యుల మధ్య ఈ ప్రేమ, పెళ్లి, పనిమనిషి ల గోల షురూ అయింది. అయినా అన్నింటికన్నా కాజల్ ను పనిమనిషి అన్న వర్డ్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: