టీవీ: రష్మీ తెరవెనుక బాధలు చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Divya
తన అందాల ఆరబోతతో.. ప్రేక్షకులకు విందుభోజనం తినిపిస్తూ ఉండే హాట్ యాంకర్లలో రష్మీ కూడా ఒకరు.. రష్మీ కేవలం యాంకర్ మాత్రమే కాదు..నటి అలాగే సంఘ సంస్కర్త కూడా. తను యాంకర్ గా సంపాదించే మొత్తంలో కొంత భాగం నిరుపేదలకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది చిన్న పిల్లల పాలిట దేవత గా మారిన రష్మీ , తెరవెనుక కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు అనే చెప్పాలి . ఇక ఆమె పడిన కష్టాల గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకాన్ని కూడా రాయొచ్చు అని అంటున్నారు ఇటీవల ఈమె బాధలు తెలిసిన కొంతమంది ప్రముఖులు.. అయితే ఈమె కష్టాల గురించి రాకేష్ తెలిపాడు.

జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరిస్తున్న వారిలో ఒకరైన రాకింగ్ రాకేష్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మీ గురించి మాట్లాడిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా ను కుదిపేస్తున్నాయి.. నిజానికి అందరూ అనుకుంటున్నట్టుగా రష్మీ ,సుధీర్ మధ్య ఏమి లేదని.. కేవలం జనాలను ఎంటర్టైన్మెంట్ చేయించడం కోసం మాత్రమే వీరిద్దరూ ఇలా చేస్తున్నారు అని తెలిపాడు రాకేష్.. ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్  కలిసి నటిస్తే ఆ సినిమా హిట్ అయితే, సూపర్ హిట్ జోడి అని ఎలా అంటామో, ఇక బుల్లితెరపై రష్మి - సుదీర్ కూడా సూపర్ హిట్  జోడిగా మాత్రమే పరిగణించవచ్చు అని తెలిపాడు..

అంతే కాదు రష్మీ అల్లరి పిల్ల, ఓపెన్ హాట్ గర్ల్, బంగారం అని కూడా రాకేష్ తెలిపాడు.. ఆమె కష్టాలు, బాధలు నేను స్వయంగా చూశాను.సోషల్ ప్రోగ్రామ్స్ చేసే ఈ విషయంలో రష్మి సూపర్ అంటూ తెలిపాడు రాకింగ్ రాకేష్.. రష్మీ చిన్నతనంలోనే తన తండ్రి వీరి కుటుంబాన్ని వదిలి పెట్టి వెళ్లడంతో, తన కుటుంబానికి అన్ని తానై పెద్దగా తన కుటుంబాన్ని నడిపిస్తోంది.. సమాజంలో ఒక ఆడపిల్ల ధైర్యంగా బతుకుతోంది అంటే ఆ వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. రష్మీ పడిన ప్రతి కష్టం గురించి నాకు తెలుసు అంటూ రాకింగ్ రాకేష్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: