టీవీ: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో విడుదలకానున్న చిత్రాలు ఇవే..!
1). ఇచట వాహనములు నిలుపరాదు:
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం ఇచట వాహనాలు నిలుపరాదు. ఈ సినిమా అప్పుడే థియేటర్లో విడుదల అయ్యి, మరి ఇప్పుడు...ఈ నెల 17న ఆహాలో విడుదలకానుంది.
2). అన్ బెల్ సేతుపతి..
హీరో విజయ్ సేతుపతి, తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం అన్ బెల్ సేతుపతి. ఈ చిత్రం ఈ నెల 17న.. డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
3). విజయ రాఘవన్:
టాలీవుడ్లోకి బిచ్చగాడు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన సినిమాలు తీసి కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయరాఘవన్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదలకానుంది.
4) గల్లీ రౌడీ:
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి హిట్ ను అందుకున్నాడు హీరో సందీప్ కిషన్. ఇక ఆ తర్వాత ఈయనకి ఏ సినిమాలు సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఇక ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాలో నటించాడు.. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది.
5). నితిన్ మాస్ట్రో:
నితిన్ హీరోగా, నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మాస్ట్రో.. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కూడా ఈ నెల 17న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
6). డోంట్ బ్రీత్-2:
హర్రర్ నేపథ్యంతో కూడిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది.