బిగ్ బాస్ 5: హఠాత్తుగా కుప్పకూలిన లోబో... కారణం ఇదేనా?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి ఫైర్ కాస్త ఎక్కువగానే ఉంది. వివాదాల డోసు రోజురోజుకీ శృతి మించుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా బిగ్ బాస్ ఇంటి పోటీదారుల తీరు ప్రేక్షకుల్ని మరింత ఆశ్చర్యపరుస్తోంది. బాబోయ్ రెండవ వారానికే తగాదాలు షురూ అయిపోయాయిగా అనుకుంటున్నారు ఆడియన్స్. నిజానికి వారికి ఓ పక్క ఇలాంటివి ఫుల్ ఎంటర్టైన్మెంటే. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చి నిమ్మళంగా ఉన్న కంటెస్టెంట్ లను టాస్క్ పేరుతో మళ్ళీ కదిలించాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చి కంటెస్టెంట్స్ తో కబడ్డీ ఆడించారు. అప్పటి వరకు కాస్త నెమ్మదిగా ఉన్న వారంతా టాస్క్ మొదలవగానే రేసు గుర్రాల్లా పోటీలో గెలవడానికి పరుగులు తీశారు. కానీ అందరిలో టాస్క్ లో అలసిపోయిన లోబో ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు.
అయితే ఇంటి సభ్యులు అంతా వారి ఆటలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఒక్క నటరాజ్ మాస్టర్ లోబోకి ఏమయ్యిందో అని అతడు రాకుండా ఎలా ప్రశాంతంగా ఆడగలం అని గింజుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో బిగ్ బాస్ అతడ్ని మెడికల్ రూం లోకి తీసుకురమ్మని ఆదేశించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి లోబో తిరిగి మళ్లీ బయటకు వచ్చి గేమ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అందరూ లోబోని పరామర్శించారు. కానీ చూసే వారికి అదేదో మాటవరసకి పలకరింపులా అనిపించింది. అంత దిగులు ఉన్న వాళ్ళు ముందే గేమ్ ని అపేసి లోబో కోసం వెయిట్ చేసుండాలిగా, ఇప్పుడెందుకు డ్రామాలు అనిపించింది.
ఇక ఆ తర్వాత కూడా చాలా మంది ఇంటి సభ్యులు టాస్క్ లో గెలిచే నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు అలా నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. కాగా ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారంలో మిగిలి ఉన్న మరో మూడు రోజులు టాస్కు లు బాగా ఆడి ప్రజల మనసును గెలుచుకుని నామినేషన్ నుండి బయటపడాలని చూస్తున్నారు. మరి ఏమి జరగనుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: