బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ను కాపీ కొడుతున్న కాజల్...

VAMSI
ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో రెండవ వారం జోరుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే హీట్ స్టార్ట్ అవుతోంది. మొదటి వారం హౌస్ నుండి సరయు రాయ్ ఎలిమినేట్ అవడం కొంచెం ఇబ్బంది కలిగించినట్లుగా ఉంది. అయితే మరి కొంతమంది ప్రేక్షకులు ఈమె వచేయడమే మంచిదయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ లో మిగిలింది 18 మంది మాత్రమే. నిన్న జరిగిన నామినేషన్ రౌండ్ లో వివాదాలు స్థాయి దాటిపోయింది. మాములుగా ఎక్కడైనా ఆవేశం ఎక్కువగా మగవారికి ఉంటుంది. కానీ ఇక్కడ మగవారిది ప్రేక్షక పాత్ర అయిపోయింది. ముఖ్యంగా ఉమాదేవి మరియు శ్వేతా వర్మలు అయితే ఎక్కడున్నాము, ఏ ప్లాట్ ఫామ్ పై పెర్ఫార్మ్ చేస్తున్నాము అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు అనే చెప్పాలి. వారు మాట్లాడే మాటలకు ప్రవర్తించే తీరుకు అందరూ షాక్. అలా హాట్ హాట్ గా నామినేషన్స్ పూర్తయిపోయాయి.
ఈ సారి నామినేషన్ లోకి నటరాజ్, అనీ, ప్రియా, ప్రియాంక సింగ్, ఉమా దేవి, లోబో మరియు కాజల్ లు ఉన్నారు. గత వారం నామినెటే ఆయిన్ వారిలో ఈ సారి కూడా ప్రియాంక సింగ్ మరియు కాజల్ లు ఉన్నారు. అయితే కాజల్ ను చూస్తే బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ ను గెలుచుకున్న కౌశల్ గుర్తొస్తున్నాడు. చాలా లక్షణాలు ఇద్దరిలో మ్యాచ్ అవుతున్నాయి. కౌశల్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి కేవలం గేమ్ పైనే ఫోకస్ పెట్టాడు. ఎటువంటి బంధాలకు లోను కాలేదు. ఎవరితోనూ రిలేషన్స్ కొనసాగించలేదు. ఎప్పుడూ గేమ్ పై సీరియస్ గా ఉన్నాడు. చివరి వరకూ హౌస్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురయినా నిలబడి గెలిచాడు.
ఈ లక్షణాలు కొన్ని ఆర్ జె కాజల్ లోనూ ఉన్నాయి. మొదటి రోజు నుండి బిగ్ బాస్ గురించే ఆలోచిస్తూ ఉండడం. గేమ్ పై కసి మరియు పట్టుదల. ఎవ్వరితోనూ క్లోజ్ గా మూవ్ కాకపోవడం, తనలోని ఆవేశం ఇలా ఎక్కువ అంశాలు కౌశల్ తో కలుస్తున్నాయి. అంతే కాకుండా మొదటి వారం నుండి కౌశల్ నామినేషన్స్ లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కాజల్ కూడా గడిచిన రెండు వారాలలోనూ నామినేషన్స్ పేస్ చేస్తూ ఉంది. ఎవరైతే ఎక్కువ నామినేషన్స్ పేస్ చేస్తారో వారికి ఓటింగ్ బ్యాంకు ఎక్కువవుతుంది గతంలో కౌశల్ ప్రూవ్ అయింది. ఇప్పుడు అదే విధంగా కాజల్ కూడా రోజు రోజుకీ ప్రేక్షకుల గుండెల్లో తన సహజమైన ఆటతీరుతో స్ట్రాంగ్ గా మారి టైటిల్ కొడుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఏమి జరగనుందనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: