బిగ్ బాస్ 5: కాజల్ కు ఫ్యామిలీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా ?

VAMSI
బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులున్నామన్నది కాదు. ఎలా ఉన్నామన్నది అసలు పాయింట్. అక్కడ కంటెస్టెంట్ వైఖరిని బట్టి ఫాలోయింగ్ పెరుగుతుంది. పెద్దగా గుర్తింపు లేని వారు వచ్చినా పెద్ద సెలబ్రిటీలు అయిపోవడం మాత్రం ఖాయం. అయితే వారి వారి నడవడిక, యాక్టివ్ నెస్ ను బట్టి వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. సీజన్ 2 లో కౌశిక్ కి కూడా బిగ్ బాస్ షో బిఫోర్ వేరే.. ఆఫ్టర్ బిగ్ బాస్ వేరే.. కౌశిక్ ఆర్మీ అంటూ ఓ రేంజ్ లో అభిమానులు తన వైపు నిలబడి మరి గెలిపించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఎవరి పద్దతి వారిది, ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళది. కొందరు గొడవలకు దూరంగా ఉంటూ గేమ్ ని ప్రశాంతంగా ఆడాలనుకుంటే మరికొందరు ఇతర కంటెస్టెంట్ లను తొక్కైనా సరే గెలవాలనుకుంటారు.
ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లలోనూ వివిధ రకాల గేమ్ స్ట్రాటజీలను చూసాం.   అయితే ఈసారి సీజన్ 5 లోని పందొమ్మిది ఇంటి సభ్యులు ఫుల్ క్లారిటీతో వచ్చినట్లు అనిపిస్తోంది. ఎవరికి వారు టైటిల్ కొట్టడానికి తెగ ఆరాటపడుతున్నట్లు కనబడుతూనే ఉంది. కానీ కొందరు తమ ఆవేశాన్ని ఆపుకోలేక పప్పులో కాలేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో శ్వేత వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, ఇక ఉమా దేవి అయితే షో టెలికాస్ట్ అవుతుంది అన్న విషయం విస్మరించి బూతుల దండకం చదివేసింది. ఇక కాజల్ అయితే ఏంటి నన్ను ఒక ఫేక్ అంటూ ఇలా బ్లేమ్ చేస్తున్నారు. మొదట నా పద్దతి బాగోలేదు అంటే వాళ్ళ కోసం కొంత మార్చుకున్నాను అయినా సరే నేను ఏమి చేసినా యాక్టింగ్ అంటుంటే ఎలా ఊరుకోవాలి అంటూ ఎమోషనల్ అయ్యింది.
అంతే కాదు ఈ షో నా కూతురు చూస్తుంటుంది. అలాంటిది నన్ను పదే పదే ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్, ప్రిపేర్ అయి వచ్చావు. అంటూ నానా కామెంట్లు చేస్తే నన్ను మా ఇంటి సభ్యులు ఏమనుకుంటారు అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇవన్నీ చూసి మా పాప ఎంత బాధ పడుతుంది అంటూ ఏడ్చేసింది. అప్పుడు ఇంటి సభ్యులు వచ్చి ఆమెను ఓదార్చారు. ఈ ఎపిసోడ్ చూసిన కొందరు ఎపుడు చూసినా తనకు మాత్రమే ఫ్యామిలీ ఉన్నట్టు సెంటిమెంట్ బోర్డ్ పెట్టేస్తుంది. మాకు ఆ మాత్రం అర్ధం అవదా అంటున్నారు. ఇంకొందరు పాపం అమ్మాయి బాగా ఫీల్ అవుతుంది, తనేమి నటి కాదు నటించడానికి ఎలా అనిపిస్తే అలా చేసుకుపోయే కాజల్ ని ఇలా ఊరికే టార్గెట్ చేయడం మంచిది కాదంటూ ఆమెకు మద్దతు పలుకుతున్నారు. మరి కాజల్ కు ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా లేదా రివర్స్ అవుతుందా చూడాలి. కాగా ఈ వారం కూడా కాజల్ నామినేషన్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: