సరయు చేసిన ఆ తప్పే ఎలిమినేట్ అవడానికి కారణమా?

VAMSI
ప్రతి ఇంట బిగ్ బాస్ సీజన్ 5 సందడి షురూ అయింది. గంట కొట్టినట్టు నైట్ పది అయితే చాలు అందరి ఇళ్ళల్లోనూ బిగ్ బాస్ హౌస్ సభ్యుల స్వరాలు వినబడుతున్నాయి. ఒకేసారి ఏకంగా 19 కంటెస్టెంట్స్ తో మొదలయిన సీజన్ 5 హౌస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ను ఇస్తోంది. కాగా ప్రేక్షకుల ఓటింగ్ ను బట్టి ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఇంట్లో నుండి ఎలిమినేట్ అవుతారన్న విషయం తెలిసిందే. అయితే ఎవర్ని ప్రేక్షకులు తక్కువ ఓటింగ్ వేసి ఎలిమినేట్ చేయాలని డిసైడ్ చేశారన్న విషయాన్ని  నాగ్ చెబుతారు. అందుకే శని, ఆది వారాలు అంటే ఇంటి సభ్యుల్లో ఓ ప్రత్యేక ఉత్సాహం కనిపించినా మరో వైపు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్న భయం ఓ మూలన ఉండనే ఉంటుంది. 

అయితే ఈ సారి మొదటి వారం బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ గా చేస్తున్నటువంటి నాగ్ స్టేజ్ పై ఈలలు వేసే గోల చేశారు. టాస్క్ లతో హౌస్ మేట్స్ ను ఒక ఆట ఆడించారు. ఇక చివరగా అదే టాస్క్ లతో సరయు ఎలిమినేట్ అయినట్లు క్లారిటీ ఇచ్చేశారు నాగ్. మొదటి వారం ఎలిమినేట్ అవ్వబోయేది సరయు అని ముందుగానే మీడియా న్యూస్ లలో హల్చల్ జరిగినా కొందరు ఏదో ఒక మూల సరయుని అంతా ఈజీగా హౌస్ నుండి బయటకు పంపించరులే అనుకున్నారు. కానీ చివరకి సరయు ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌజ్ లో నుండి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన సరయు తనను ఇబ్బంది పెట్టిన కంటెస్టెంట్ లను ఒక ఆట ఆడుకుంది.

అయితే సరయు ఎలిమినేషన్ ను ఊహించని అభిమానులు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సరయు అంత మంచితనం ఆ బిగ్ బాస్ హౌస్ లో పనికి రాదని, మాటకు మాట సమాధానం మరియు కన్నింగ్ నేచర్ ఉంటేనే అక్కడ సర్వైవ్ అవ్వగలరని సరయు చేసిన పొరపాటును గుర్తు చేస్తున్నారు. మొదటి నుండి కంటెస్టెంట్ ల వ్యవహారశైలిని అర్ధం చేసుకునే ప్రయత్నంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆమెపై జాలి చూపిస్తున్నారు. సరయు యూట్యూబ్ లో వచ్చే షార్ట్ ఫిలిమ్స్ లో ఎలా ఉంటారో అలాగే ఉండి ఉంటే ఎలిమినేట్ అయ్యేది కాదని ఆమెను వెనకేసుకొస్తున్నారు అభిమానులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: