టీవీ: బిగ్ బాస్ పై ఫైర్ అయిన నారాయణ..!

Divya
ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ నారాయణ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఈ షో కారణంగా అందరూ సంస్కృతిని కోల్పోతున్నారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు .. అంతేకాదు వెంటనే ఈ షో నిలిపివేయాలంటూ కూడా డిమాండ్ చేయడం గమనార్హం.. సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారనే నెపంతో ఆయన ఈ షో నీ నిలిపివేయాలి అంటూ తన మనసులోని మాటను చెబుతున్నాడు.. కళామ్మ తల్లికి అన్యాయం జరుగుతోంది.. దీని వల్ల ఆ తల్లికి ప్రమాదం ఏర్పడింది.. అందుకే బిగ్ బాస్ నిలిపివేయాలి అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈయన బిగ్బాస్ సీజన్ వన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారి ఒక వీడియోను విడుదల చేస్తూ వస్తున్నాడు. ముందు సీజన్ కి కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బిగ్ బాస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాకపోతే ఈ సారి కొంచెం ఘాటుగా స్పందిస్తూ .. ఇది అనైతిక షో అని ఒక బూతుల ప్రపంచం అని కూడా ఆయన కోపం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగం ఉందా..?  ఈ సంస్కృతి దేనిని ప్రతిబింబిస్తోంది.. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ షో ప్రసారానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తోంది.. ప్రపంచానికి వందల వేల కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారాలకు ఉపయోగపడే పద్ధతుల్లో అనుమతివ్వడం చాలా ఘోరం..బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు పోట్లాటలు,కీచులాటలు ఒక అనైతిక పద్ధతిని గోచరిస్తున్నాయి.ఈ హౌస్ లో ఎవ్వరికి ఐక్యత అనే భావం లేకపోవడం చాలా దురదృష్టకరం.
ఇలాంటి వారిపట్ల కోర్టు సరైన తీర్పు నివ్వాలి ..పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీరికి సహాయం చేయకూడదు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన ఒక అనైతిక ప్రోగ్రామ్లకు అనుమతించడం మంచిది కాదు అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: