బిగ్ బాస్ 5: నాగార్జున ఆ కంటెస్టెంట్ ని కరుణిస్తాడా... ?

VAMSI
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ షో ఎట్టకేలకు మొదలయ్యింది. ఇపుడు ఏ ఇంట్లో చూసినా ప్రతి రోజూ బిగ్ బాస్ హౌస్ కంటిస్టెంట్ల సందడే సందడి. అప్పుడే హౌస్ లో ఇంటి సభ్యుల నవ్వుల కోలాహలంతో పాటు చిన్న చిన్న గొడవలు కూడా మొదలయ్యాయి. ఆడియన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఈ విషయంలో వందకి వంద శాతం న్యాయం చేసే రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకి ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచుతోంది. వారమంతా ఒక లెక్క వారంలో వచ్చే చివరి రెండు రోజులు మరో లెక్క. ఇది వినగానే అందరికీ ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక ఎత్తు అయితే శని, ఆది వారాల్లో బిగ్ బాస్ స్టేజ్ పై నాగ్ చేసే సందడి మరో ఎత్తు.
శని,ఆదివారాల్లో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మరి. కొత్త టాస్క్ లతో నాగ్ చేసే హంగామా. ఆ టాస్క్ లతో రిస్క్ లు చేసే హౌస్ మేట్ల తిప్పలు వారి అల్లరి వేరే లెవల్. అంతే కాదు ఇంటి సభ్యులు కాస్త శృతిమించి చేసే పనులకు నాగ్ చివాట్లు పెట్టేది కూడా శని ఆదివారాల్లోనే. ప్రేక్షకులు నాగ్ కనిపించే ఈ రెండు రోజుల షో కోసం మరింత ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఇపుడు ఎంటర్టైన్మెంట్ దొరికే సమయం రానే వచ్చింది. నేడు శనివారం అంటే బిగ్ బాస్ స్టేజ్ పై నాగ్ కనిపించే రోజు అందులోనూ సీజన్ 5 ప్రారంభమయ్యాక హౌస్ లో ఇంటి సభ్యుల కుశలం గురించి నాగ్ మాట్లాడ బోయే మొదటి రోజు కావడంతో ఆడియన్స్ మరింత ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
నేడు కంటెస్టెంట్ తో నాగ్ టాస్క్ లు పెట్టి ఎలా ఆడుకుంటారో తెలియాలంటే ఇంకాసేపు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఇంటి సభ్యుల మధ్య చిన్న వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా మోడల్ జస్వంత్ సెంటర్ అఫ్ ది బిగ్ బాస్ హౌస్ అయిపోయారు. మొదటి వారంలోనే ఎక్కువ వైతిరేకతను ఇంటి సభ్యులలో మూటగట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఈ వారంలో వరెస్ట్ పెరఫార్మెర్ గా నిలిచి జైల్లో ఉన్న జస్వంత్ ను నాగ్ మందలిస్తాడా లేదా ఎలాగు బాధలో ఉన్నాడు కదా అని కరుణించి వదిలిస్తాడా చూడాలి. చివరిగా రాత్రి జరిగిన ప్రియాంక మరియు ఉమా దేవి వివాదం కూడా పెద్దదే. దీని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: