బిగ్ బాస్ 5: సినీనటి ఉమాదేవిని నోర్ముయ్ అన్న ప్రియాంక సింగ్..

VAMSI
తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షోకి వచ్చే రేటింగ్ ను చూస్తేనే ఆడియన్స్ బిగ్ బాస్ షోకి ఎంతగా కనెక్ట్ అయ్యారో తెలుస్తుంది. ఈ షోకి ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుండడం విశేషం. ప్రతి సీజన్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంటోంది. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ 5 అంటూ అంగరంగ వైభవంగా మొదలైపోయింది. ఇప్పటికే సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అయితే వారి వారి వ్యవహార శైలిని బట్టి బయట వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా టాస్క్ లు, నామినేషన్ ప్రక్రియ సమయాల్లో ఇంటి సభ్యులు బిహేవియర్ ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
మిగిలిన టైంలో అయితే కాస్త కంట్రోల్ గానే ఉండటానికి ప్రయత్నిస్తారు గానీ, ఏదైనా టాస్క్ వచ్చినా, నామినేషన్ సమయంలో అయినా ఇంటి సభ్యులు అసలు బలాలు, బలహీనతలు బయటపడుతుంటాయి. అందులోనూ వారికి తెలియకుండానే వారిలోని మరో యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో వారిని వారు కంట్రోల్ చేసుకోవడం కాస్త కష్టమే. మనసులోని మాటలు తెలియకుండానే బయటకు వచ్చేస్తాయి. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బిగ్ బాస్ హౌస్ లో హైలెట్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ అయిన  ఉమాదేవి మరియు ప్రియాంక సింగ్ ల మధ్య మాట మాట పెరిగింది. దాంతో విషయం కాస్త వివాదంగా మారిందనే చెప్పాలి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో  గడిచిన వారం రోజులలో ఇప్పటి వరకు చూసుకుంటే బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అలాగే వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అన్న అభిప్రాయం ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు కోసం చర్చ జరుగుతుండగా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలను ఒక్కొరుగా వ్యక్తపరిచారు.
వారి దృష్టిలో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు గడిచిన రోజులను దృష్టిలో పెట్టుకొని బెస్ట్ అండ్ వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించిన వారి పేర్లను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రియాంక సింగ్ వరెస్ట్ కంటెస్టెంట్ గా ఉమా దేవి పేరును తెలిపి తన అభిప్రాయాన్ని బిగ్ బాస్ కు తెలిపింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. నేనే ఎందుకు వరెస్ట్ కంటెస్టెంట్ గా కనిపించానంటూ ఉమాదేవి ప్రియాంక సింగ్ పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదంగా మారింది. ఒకానొక దశలో వ్యక్తిగత విషయాలను సైతం తవ్వుకునే అంత దూరం వెళ్ళింది వ్యవహారం. ఇందులో ఇద్దరిదీ సమానంగా పొరపాటు ఉంది. కానీ ప్రియాంక సింగ్ పెద్ద వయసున్న వర్ణయ్ చూడకుండా నోరు ముయి అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారనుంది. అంతే కాకుండా ప్రియాంక వాడిన కొన్ని మాటలు ఉమా దేవిని బాధ పెట్టాయి. ఈ రోజు నాగార్జున రానుండగా ఈ వివాదం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: