టీవీ : డాక్టర్ బాబు ఆస్తి విలువ తెలుసా..?

Divya
బుల్లితెరపై ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన నాటికలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న నాటికలలో కార్తీకదీపం సీరియల్ కు మొదటి స్థానం దక్కిందని చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇక ఈ సీరియల్ గురించి ఎటువంటి విషయం వచ్చినా కూడా ఇది చాలా ట్రెండీగా మారుతుంది. ఇక ఇప్పుడు ఇందులో నటించే డాక్టర్ బాబు ఆస్తి విలువ ఎంతో తెలుసుకుందాం.

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని బుల్లితెరపై అడుగులు వేశారు. అంతేకాకుండా ఈయన ఒకానొక సమయంలో హీరోగా కూడా వెళ్దామని ప్రయత్నించాడట. ఇక చెన్నై లో ఉద్యోగం మానుకొని తిరిగి సినీ ఇండస్ట్రీ లోకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ విషయం తన తండ్రికి ఇష్టం లేదు. ఇక ఈయన తండ్రి చనిపోవడంతో, తీవ్ర మనస్తాపం చెంది, ఎలాగైనా సరే తనకిష్టమైన రంగంలో కి వెళ్లాలని, బుల్లితెరపై అడుగులు వేశాడు. ఇక ఈయన భార్య పేరు మంజుల. ఈమె కూడా పలు నాటకాలలో నటించింది.
ఇక వీరిద్దరూ కలిసి రెండు చేతుల సంపాదిస్తూనే ఉన్నారు. నిరుపమ్ ఆస్తి విషయానికి వస్తే , ఆయన నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ కు ప్రతిరోజు 22,000 రూపాయలను తీసుకుంటారట. ఇక అంతే కాకుండా ఈయన రెండు సీరియళ్లలో నటించేందుకు ఒప్పుకున్నాడట. ఆ సీరియల్ కు  ప్రతిరోజు 60,000 వేల వరకు వస్తుందని వార్త వినిపిస్తోంది. దీన్ని బట్టి మనకి నిరుపమ్ ప్రతినెల రూ.14 లక్షల వరకు సంపాదిస్తుంటారు అని తెలుస్తోంది.
ఇక అంతే కాకుండా ఈయన ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో, 5 కోట్లు రూపాయలు విలువ చేసే ఒక ప్రాపర్టీ కూడా ఉందట. హైదరాబాదులో రూ. 20 లక్షలు విలువ చేసే ఒక ఇల్లు ఉందట, ఇక ఈయన దగ్గర రూ. 11 లక్షలు విలువచేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇదంతా నిరుపమ్ బుల్లితెర మీద సంపాదించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: