టీవీ: పటాస్ ఫహిమా ఎవరో తెలుసా..?

Divya
ప్రస్తుతం బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్ లను తయారు చేస్తున్నది మల్లెమాల ప్రొడక్షన్స్ . అయితే వీళ్లు నడిపించే షోల ద్వారా ఎంతో మందికి లైఫ్ ను ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఇందులో నటించిన కమెడియన్స్ హీరోలుగా, కమెడియన్స్ గా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కొంతమంది ని పటాస్ షో నుంచి తీసుకున్న వారిలో ఫహిమా కూడా ఒకరు.
ప్రతి ఒక్కరిని నవ్వించే ఏకైక షో  అంటే జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఇక ఇందులో నటించే యాంకర్స్, నటులు, జడ్జెస్ వల్ల ఈ షోకు మరింత హైప్ వస్తోంది అని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఇమ్మాన్యుయేల్, వర్ష ఎంతో బాగా పాపులర్ అయ్యారు అని చెప్పవచ్చు . ఇక అదే తరుణంలోనే ఫహిమా కూడా తన కామెడీతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇందులో ఈమె వేసే అడల్ట్ కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక అంతే కాకుండా జబర్దస్త్ షో ద్వారా ఈమెకు మరికొంత మంది ఫాలోవర్స్ పెరిగారు. ఈమె ఇంతకు ముందే పటాస్ -2 తో అక్కడ కొంత మంది  అభిమానులను సంపాదించుకుంది. ఈ షోకు యాంకర్ గా రవి, శ్రీముఖి చేశారు. మొన్నా ఆ మధ్యన ఫహిమా కొన్ని ఇంటర్వ్యూలలో సినీ ఇండస్ట్రీ లో జరిగేటువంటి క్యాస్టింగ్ కౌచ్ మీద కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసిందని సినీ ఇండస్ట్రీలో వినికిడి.
ఇక జబర్దస్త్ షో తో బాగా పాపులర్ సంపాదించిన ఫహిమా తన హాట్ హాట్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈమె రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. అందులో ఉండేటువంటి కంటెస్టెంట్ లకు ఇచ్చే అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని వినికిడి. ఇటీవల జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ పై భారీ స్థాయిలో పంచులు వేస్తూ రాకెట్ లా దూసుకుపోయింది. ఇక రష్మి ఏంటి మేడం.. అని అడగగా అందుకు రోజా..ఫహిమా  జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది అంటూ రోజా కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: