బుల్లి పిట్ట: త్వరలో రాబోతున్న టాటా నానో.. సామాన్యులకు కూడ..!!

Divya
ప్రముఖ దేశీయ కార్ల సంస్థలలో ఒకటైన టాటా మోటార్స్ చిన్న కారు నానో అండ్ సఫారీ స్మార్ట్ SUV నీ ఏప్రిల్ 2020లో విడుదల చేసింది. ముఖ్యంగా BS -6 ను అమలు చేయడంతో వీటి తయారీ నిలిపివేసింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే చిన్నకారుగా ప్రచారం పొందిన టాటా నానో.. ఇండియాలో కంపెనీ సేల్స్ అందించడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు.  ఈ కారు కంపెనీ చాలా ముఖ్యమైనది మాత్రమే కాకుండా టాటా నానో కంపెనీ చైర్మన్ రతన్ టాటా హృదయానికి చాలా దగ్గర అయిందని కూడా చెప్పవచ్చు.

ఈ కారు ఉత్పత్తులను 2018 లో నిలిపివేయడం జరిగింది. ఈ కారులను హ్యాచ్ బ్యాక్ కార్ 624 CC ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో విడుదల చేయడం జరిగింది. ఈ కార్ ఇంజన్ ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ లేదా AMT గేర్ బాక్స్ తో అందించనున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ..మళ్లీ ఈ కార్ ల కోసం చూస్తోందట ఆ సంస్థ. టాటా నానో ఈ వెహికల్ వివరాలు అలాగే సస్పెన్షన్ సెటప్ టైర్లలో ముఖ్యమైన మార్పులను మనం ఇందులో చూడవచ్చట.
కానీ నానో టాటా టీవీ ప్లస్ ఉత్పత్తి దశకు చేరుకున్నట్లు అయితే.. తమిళనాడు ప్రభుత్వంతో పలు కంపెనీలు చర్చలు జరిపి తిరిగి ప్రారంభించవచ్చని నివేదికలు తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయంపై నానో ఎలక్ట్రిక్ కార్లపై ప్రస్తుతం కంపెనీ ఎటువంటి అధికారికంగా ప్రకటన వెలువడమే లేదు. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు EV లను విక్రయిస్తోంది. అందులో tigor EV, xpress -T ,nexon EV అంటే కార్లను టాటా విడుదల చేయడం జరిగింది. వీటి ధర రూ.8.49 లక్షల నుండి మొదలవుతుందని తెలియజేసింది. వీటిని వచ్చే ఏడాది జనవరిలో డెలివరీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇక పూర్తి వివరాల కోసం త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలు తెలియజేస్తామని తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: