బుల్లి పిట్ట: ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్స్..!!

Divya
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే ప్రజలు మక్కువ చూపుతున్నారు. దీంతో సరికొత్త ఎలక్ట్రానిక్ వాహనాలు ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలలో లభించే పలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పలు కంపెనీ సంస్థలు మార్కెట్లోకి తీసుకువస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అందుబాటులోకి రాబోతోంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను వచ్చే ఏడాది మార్చిలో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ స్కూటర్ను గతంలో ఆవిష్కరించిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా వాటిని బుకింగ్ చేసుకునేందుకు సదుపాయం ఇంకా ప్రారంభించలేదు తమిళనాడులోని గాలగిరి వద్ద  రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాట్ ఫామ్ ను ఏర్పరచడం జరిగింది. దీంతో అక్కడ ప్రతియేట పది లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది. ఈ సింపుల్ ఎనర్జీ కంపెనీ. ఇక 2023 జనవరి 19 నుంచి స్కూటర్లు తయారు మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు.

ఆ తర్వాత మార్చి నుంచి స్కూటర్లు డెలివరీ చేస్తామని కాకపోతే గతంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.10 లక్షల వరకు ఎక్స్ షోరూం ధర ఉంటుందని తెలియజేసింది. కానీ సరఫరాల సమస్య నేపథ్యంలో ఈ ధర పెరగవచ్చని సంకేతాలను తెలియజేస్తోంది. రాష్ట్రాల సబ్సిడీ కాకుండా ఎక్స్ షోరూం ధర రూ.1.45 లక్షలు ఉంటుందని తెలియజేస్తోంది. అయితే ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 235 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోందని కంపెనీ తెలియజేయడం జరిగింది. దీనిని సరికొత్త అప్డేట్ తో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చే సమయానికి మరింత అభివృద్ధి చేసి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే విధంగా మరింతగా వీటిని అభివృద్ధి చేయబోతున్నామని తెలియజేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: