బుల్లి పిట్ట: చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ధర ఎంత అంటే..?

Divya
స్వదేశంలో తయారైన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఈ రోజున మార్కెట్లోకి విడుదల కాబోతోంది. PMP ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన ఒక మైక్రో ఎలక్ట్రిక్ వెహికల్ EAS కారు ఈరోజు తక్కువ ధరకే వెలుబడుతోంది. ముంబైకి చెందిన ఈ కంపెనీ కారును మూడు రకాల వేరియంట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం ఈ కారు 13 కలర్లలో లభిస్తుంది. కంపెనీ సమాచారం తెలిపిన మేరకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 120 నుంచి 200 కిలోమీటర్ల వరకు పయనిస్తుంది అని సమాచారం.3KWAC చార్జర్ ని ఆఫర్ చేస్తుండగా బ్యాటరీ మొత్తం చార్జ్ కావడానికి కనీసం నాలుగు గంటల సమయం పడుతుందని సమాచారం.

ఇక ఈ కారు ధర సుమారుగా రూ.4 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే కారు కలర్ను బట్టి వేరియంట్ను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక కారు ప్రత్యేకతలు విషానికి వస్తే.. ఇందులో డీజిల్ ఇన్ఫోర్ట్మెంట్ సిస్ట్మ్. యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ క్రూజ్ కంట్రోల్ ,సీట్ బెల్ట్, ఏసి, రిమోట్ కి లేస్ ఎంట్రీ తదితర ఆప్షన్లు ఉన్నాయి ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ పొడవు విషయానికి వస్తే..2,915 MM వెడల్పు 1,157 వెడల్పు 1,157 MM, ఎత్తు 1600 MM గా ఉన్నది ఇక బరువు విషయానికి వస్తే 550 కేజీలు.

ఇక వీల్ బేస్ 2,087, గ్రాండ్ క్లియరెన్స్ 170 MM గా ఉన్నది ఇక ఈ కారు గతంలో టాటా కంపెనీ తెచ్చిన నానో తో పోలుస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంలో మధ్యతరగతి వారికి నచ్చే విధంగా ఎలక్ట్రికల్ కారు ఉండబోతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చౌకైన ధరకే తీసుకునే విధంగా ఈ ఎలక్ట్రిక్ కారు ఉన్నదని సంస్థ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ కారికి సంబంధించి ఈ వివరాలు మాత్రమే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: