సుజుకి యాక్సెస్ 125 నుంచో ఇంకో కొత్త ఆప్షన్?

జపాన్‌ దేశానికి చెందిన టూ వీలర్ తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న సుజుకి యాక్సెస్ 125 (Access 125) స్కూటర్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.కొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఇప్పుడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. మార్కెట్లో ఈ డ్యూయల్-టోన్ మోడల్ యాక్సెస్ 125 స్కూటర్ ధరలు రూ. 83,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.కొత్తగా విడుదలైన సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లోని కొత్త డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ సాలిడ్ ఐస్ గ్రీన్ / పెరల్ మిరాజ్ కలర్ కాంబినేషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ డ్యూయల్-టోన్ కలర్ కాంబినేషన్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డిస్క్), రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డ్రమ్) ఇంకా స్పెషల్ ఎడిషన్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. వీటిలో సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డిస్క్) చాలా ఖరీదైనది, దీని ధర రూ. 87,200 (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంటుంది.ఇకపోతే, సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డ్రమ్) వేరియంట్ ధర రూ. 85,200 ధర ట్యాగ్‌తో (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఈ కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త డ్యూయెల్ టోన్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ లో కొత్త కలర్ ఆప్షన్ మినహా వేరే ఇతర కాస్మెటిక్  మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు.


యాక్సెస్ 125 స్కూటర్ 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ మాక్సిమం 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 బిహెచ్‌పి మాక్సిమం పవర్ ని ఇంకా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తంమీద, కొత్త సుజుకి యాక్సెస్ 125 డ్యూయల్-టోన్ వేరియంట్ చాలా రిఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో ఈ వేరియంట్ మంచి సంఖ్యలో అమ్ముడవుతుందని కంపెనీ ఆశిస్తోంది.సుజుకి యాక్సెస్ 125 స్కూటర్  రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్‌లతో లభిస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్, ఎస్ఎమ్ఎస్ ఇంకా వాట్సాప్ అలెర్ట్ డిస్‌ప్లే, మిస్డ్ కాల్‌లు ఇంకా అన్‌రీడ్ ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్ వంటి ఇతర ఉపయోగకరమైన ఫీచర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే, రైడర్ కు సహకరించే ఇతర అలెర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్థాయి ప్రదర్శన, ఎస్టిమేటెడ్ అరైవల్ టైం ఇంకా యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: