బుల్లి పిట్ట: రూ.44 వేల మొబైల్ రూ.27 వెలకే మీ సొంతం..!!

Divya
ఒకప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే చాలు ఎక్కువగా పలు ఆఫ్ లైన్ షాపులలో ఆఫర్లు ప్రకటిస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ ఆన్లైన్ వినియోగానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు దీంతో పలు ఆఫర్లను కూడా దిగ్గజ సంస్థలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ కామర్ సైట్స్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఈ ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి ఫ్లిప్ కార్ట్, అమెజాన్  సంస్థలు. ఈ క్రమంలోని దసరాకు ప్రముఖ కామర్స్ సైట్స్ తమ యొక్క సేల్స్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఒక భారీ డిస్కౌంట్ సైతం అందిస్తున్నది.

ఈనెల చివరిలో ఈ ఆఫర్ ప్రారంభం కాబోతున్నది ఇందులో భాగంగా పలు స్మార్ట్ మొబైల్స్, టీవీలు,  గృహోపకరణాల పై ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ పిక్సెల్ -6 మొబైల్ పై అదిరిపోయే ఆవరణ ప్రకటిస్తోంది ఫ్లిప్ కార్ట్. అయితే ఈ స్మార్ట్ మొబైల్ అసలు ధర మాత్రం రూ.43,999 కాక ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా ఈ మొబైల్ ని రూ.27,699 రూపాయలకే సొంతం చేసుకుని అవకాశాన్ని తమ కష్టమర్లకి అందిస్తోంది.
అలాగే ICICI,HDFC కార్డుల ద్వారా 10% డిస్కౌంట్ ను కూడా అందించనుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఫుల్ హెచ్డి డిస్ప్లే తోపాటు 6.1 అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే అందిస్తోంది. ఇక గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో కూడా అందించనుంది. ఈ స్మార్ట్ మొబైల్ 6GB ram తో పాటు 128 GB మెమొరీ స్టోరేజ్ తో కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 64 ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు..4410 MAH బ్యాటరీ సామర్థ్యనీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరైనా తక్కువ ధరకే స్మార్ట్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: