బుల్లి పిట్ట: రూ.7 వేల లోపు దొరికే టాప్ స్మార్ట్ మొబైల్స్ ఇవే..!!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో మొబైల్ ని ప్రతి ఒక్కరు వాడాలని చాలా ఆతృతగా ఉంటారు యువత. అయితే కొంతమందికి అందుకు తగ్గ బడ్జెట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుచేతనే తక్కువ మొత్తంలో కలిగిన కొన్ని స్మార్ట్ మొబైల్స్ ని కొన్ని మార్కెట్లోకి విడుదల చేశాయి పలు బ్రాండెడ్ సంస్థలు. అయితే ఇప్పుడు రూ.7 వేల రూపాయల లోపు దొరికేటువంటి కొన్ని స్మార్ట్ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1). సాంసంగ్ గెలాక్సీ-A03
ఈ మొబైల్ 6.5 అంగుళాల డిస్ప్లే కలదు. మరియు ముందు భాగంలో v కటౌట్ నోచ్ ఉన్నాయి. మైక్రో ఎస్డి కార్డు తో 1TB వరకు మెమోరీ స్టోరేజ్ చేసుకోవచ్చు.  2 జిబి ర్యా మ్ , 32GB స్టోరేజ్ తో ఈ మొబైల్ కలదు. బ్యాక్ సైడ్ 8 mp సింగిల్ కెమెరాతో ఫ్రంట్ సైడ్ 5 mp సెల్ఫీ కెమెరా కలదు.

2). నోకియా C-3
ఈ మొబైల్ కూడా 6.5 అంగుళాల డిస్ప్లే తో కలదు. ఈ స్మార్ట్ ఫోన్ T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో కలదు..2GB/3GB ram తో పాటు 32GB స్టోరేజ్ మెమొరీ కూడా కలదు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 8 mp కి సింగిల్ కెమెరా.. సెల్ఫీ ప్రియుల కోసం 5 mp కెమెరా కలదు ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH బ్యాటరీ సామర్థ్యం తో పాటు 10 W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు.
3). రెడ్మీ 9A:
షియోమి నుంచి విడుదలైన తక్కువ ధర కలిగిన స్మార్ట్ మొబైల్ ఇదే.. ఈ మొబైల్ హేలియో G -25 ప్రాసెసర్ తో కలదు..3GB RAM+32 GB మెమొరీ స్టోరేజ్ తో కలదు. ఇక కెమెరా విషయానికి 13 mp బ్యాక్ కెమెరా,  5 mp సెల్ఫీ కెమెరాతో కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో పాటు 10 W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు.
4). ఇక వీటితోపాటు రియల్ మీ C-20, అలాగే మైక్రోమ్యాక్స్ ఇన్ వన్ బి  మొబైల్స్ కూడా  రూ.7000 రూపాయల లోపే కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: