బుల్లి పిట్ట: 75 వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా.. రూ.75 లకే బైక్ బుకింగ్.!!

Divya

ఏదైనా ఫెస్టివల్స్ కు ఎక్కువగా ఎలక్ట్రిక్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి ఇక రేపటి రోజున 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డార్క్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బుకింగ్ ఫీజులను భారీగా తగ్గించింది ఈ విధంగా తన మోడల్స్ గల బైకులను బుక్ చేసుకునే వారికి రూ.75 రూపాయలకి చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు ఆ తర్వాత బుకింగ్ ఫీజు 999గా మారుతుందని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో డార్క్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ మోడల్ విడుదల చేసింది.
ఈ మోటార్ సైకిల్ స్టాండర్స్ మరియు క్రాటోస్ ఆర్ అనే 2000 లభిస్తుంది వీటి ద్వారా దాదాపుగా రూ.1,7999 నుంచి రూ.1,22,999 రూపాయలుగా నిర్ణయించారు అన్ని ధరలు ఎక్స్ షోరూం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. గత నెలలో డార్క్ క్రాటోస్ భారతదేశంలో విక్రయించబడింది పూణేలో ఈ మోటార్స్ బై ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు 20 యూనిట్ల వరకు పంపిణీ చేయబడినట్లు సమాచారం. ఇక ఈ బైక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

R వేరియంట్ గల బైక్ 9KW మోటార్గా ఉంటుంది ఇది 38 న్యూటన్ మీటర్ల టార్గెట్ ను విడుదల చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ గరిష్టంగా గంటకు 105 K.M. వేగం వెళ్లకలదు మరొకటి గరిష్టంగా 28 న్యూటన్ మీటర్ల టార్కును ఉత్పత్తి చేస్తుంది ఈ వేరియంట్ గరిష్టంగా గంటకు 100 K.M వరకు వెళుతుందట ఈ రెండు వేరియంట్లు 4KWH బ్యాటరీ ప్యాక్ తో అందించబడతాయి. ఇవి రెండు పూర్తి చార్జ్ చేసినట్లయితే 120K.M వరకు వెళ్లగలరు. అయితే ఈ బైక్స్ భారతదేశంలో పూణే, ఢిల్లీ ,ముంబై ,చెన్నై హైదరాబాద్ వంటి పలు నగరాలలో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచింది. అయితే ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ తీసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: