బుల్లి పిట్ట: VLC ప్లేయర్ని భారత ప్రభుత్వం నిషేధించడానికి కారణం ఇదే..!!

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరూ మొబైల్స్ లో సినిమాలను లేదంటే వీడియోలను చూస్తూ ఉండడం సహజమే. అయితే కొన్ని వాటిలో కొన్ని వీడియోలను మాత్రమే సపోర్ట్ చేస్తాయి మరికొన్ని వాటిలో సపోర్ట్ చేయడానికి కొన్ని యాప్ సహాయంతో వీడియోలను ప్లే ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి మీడియా ప్లేయర్లలో VLC media PLAYER అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ మీడియా సర్వే ఇకమీదట భారతదేశంలో పనిచేయదట. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
VLC media PLAYER భారత ప్రభుత్వం గత రెండు నెలల క్రిందటే వీటిని నిషేధించినట్లు తెలియజేసింది మన దేశంలో VLC మీడియా ప్లేయర్ డౌన్లోడ్ లింక్ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో దానిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం యూజర్స్ కు లేకుండా అయ్యింది. అయితే అందుకు కారణం చైనాకు  చెందిన హ్యాకింగ్ గ్రూప్ CICADA సైబర్ అటాక్ చేసేందుకు  ఈ ప్లేయర్ను ఉపయోగించుకుంటూనే వార్తని ఐటీ చట్టం 2000 ప్రకారం భారత ప్రభుత్వం ఈ యాప్ ను బ్యాన్ చేసినట్లుగా తెలియజేస్తోంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న సైబర్ దాడులలో భాగంగా ఇలాంటి హానికరమైన వాటిని నిషేధిస్తున్నట్లుగా తెలియజేశారు.
చైనా కు చెందిన CICADA VLC ప్లేయర్ ను హ్యాకింగ్ చేసేందుకు కొన్ని నెలలుగా ఉపయోగిస్తుందని భద్రత నిపుణులు గుర్తించడంతో వీటిని సున్నితంగా నిషేధించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు..అయితే ఈ విషయాన్ని గగన్దీప్ సఫ్రా అనే వినియోగదారుడు VLC వెబ్సైటుకు సంబంధించి ఒక స్క్రీన్ షాట్ ని క్లిక్ చేయడం జరిగింది ఇందులో తెలిపిన ప్రకారం టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్లు ఆదేశాల మేరకే ఈ వెబ్సైట్ ని బ్లాక్ వెబ్సైటుగా పరిగణించారని ఒక స్క్రీన్ షాట్ ద్వారా ట్విట్ చేశారు. ఇప్పటికే వీటి మీద ACT FIBERNET,JIO,VODAFONE -IDEA తోపాటు ISP వంటివి ఈ మీడియా ప్లేయర్ ను బ్లాక్ చేయబడిందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: