బుల్లి పిట్ట: 5G నెట్వర్క్ వస్తే 4Gమొబైల్స్ పనిచేయవా..?

Divya
చాలా రోజులపాటు కొనసాగుతున్న 5Gనెట్వర్క్ పరిస్థితులు ఇప్పుడు ఎట్టకేలకు సద్దు మునిగినట్లుగా తెలుస్తోంది.. అతి త్వరలోనే 5g నెట్వర్క్ సర్వీస్ లను ప్రారంభించబోతున్నట్లుగా టెలికాం దిగ్గజ సంస్థలు తెలియజేయడం జరిగాయి. ఈ 5g స్పెక్ట్రమ్ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే 20 ఏళ్లకు ప్రభుత్వం 5g హక్కులను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇక రిలయన్స్ రూ.88,078 కోట్ల రూపాయలకు బిడ్ చేసినట్లు సమాచారం.

అయితే ఇప్పుడు తాజాగా నెట్టింట్లో ఒకసారి కొత్త ప్రశ్న వైరల్ గా మారుతుంది అదేమిటంటే 5Gనెట్వర్క్ వస్తే 4G స్మార్ట్ మొబైల్స్ ఆగిపోతాయా అలాగే ఇంటర్నెట్ కూడా ఆగిపోతుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి 5g నెట్వర్క్ వస్తే 4G మొబైల్స్ ఆగిపోతాయా అనేదానికి ఉదాహరణగా.. ఇదివరకు 2G, 3G,4Gనెట్వర్క్ లో ఒకదాని తర్వాత మరొకటి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న 5జి అనేది 4G కి నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. ఇదే 5g జనరేషన్ 10 సంవత్సరాల క్రితం మనకు 4G సేవలు ప్రారంభమైన కూడా 2G లేదా 3G సేవలు మాత్రం ఆగిపోలేదు అలాగే  ఏదో విధంగా 4G సర్వీసులు కొనసాగుతూనే ఉంటాయి.

అన్ని టెలికాం కంపెనీలు చెబుతున్న మాట ఏమిటి అంటే 5 G  నెట్వర్క్ వచ్చినా 4G  నెట్వర్క్ ఆగిపోదని తెలియజేస్తున్నారు. మీ పాత 4G మొబైల్ కూడా పనిచేస్తుంది అని తెలిపారు. వాటిని నిక్షింతగా కొనసాగించవచ్చని తెలిపారు. దేశంలో 13 ప్రధాన నగరాలలో 5g సేవలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. అయితే 5g వస్తే 4G ఆగిపోతుందనే మాట అవాస్తవమని చెప్పవచ్చు.. ఒకవేళ మీరు 5g నెట్వర్క్ తీసుకున్నట్లయితే.. మీరు కూడా 5g మొబైల్ తీసుకోక తప్పదు. ఇకపోతే 4Gనెట్వర్క్ కంటే చాలా రెట్టింతలు వేగంతో  5G నెట్వర్క్ స్పీడ్ అందుకుంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: