బుల్లి పిట్ట: ఆగస్టు 7న విడుదల కాబోతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. ధర ఎంత అంటే..?

Divya
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ మార్కెట్లోకి త్వరలో రాబోతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ -350 . దీన్ని ఆగస్టు 7వ తేదీన మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు ఈ సంస్థ. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కోసం ఎదురు చూస్తున్న ప్రియులకు ఇదొక గుడ్ న్యూస్ వంటిదని చెప్పవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఆకట్టుకునే విధంగా కళ్ళు చెదిరే డిజైన్స్ తో రాబోతోంది.. త్వరలో రానున్న ఈ బైక్ గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ -350 బైక్ చాలా తక్కువ బరువుతో అద్భుతమైన పర్ఫామెన్స్ ను అందిస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా హంటర్ 350 బరువు క్లాసిక్ 350 మరియు మీటర్ -350 బైకుల కంటే 15 కిలోల వరకు చాలా తక్కువగానే ఉంటుందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా గతంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెర్ఫార్మషన్స్ కంటే మరింత మెరుగు పరిచే విధంగా ఉండబోతోందని తెలియజేశారు. ఇక ఈ బైక్ 1370 M.M. వీల్ బేస్ కలిగి ఉంటుందట.

ఈ బైక్ పొడవు కూడా 2055.M.M ఉంటుందట ఈ బైక్ మొత్తం ఎనిమిది కలర్లలో లభిస్తుంది టాప్ అండ్ వేరింట్లలో మాత్రమే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ను కూడా లభిస్తుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ -350 బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ యొక్క ధరలకంటి అతి తక్కువ ధరలకే లభించబోతోంది అని సమాచారం ఈ బైక్ ధర రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉండే బైకుల కంటే తక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది ఈ బైక్ ధర దాదాపుగా.. రూ.1.5 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవ్వచ్చు అని టెక్నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక వేళ ఇదే ధరలో కొనసాగితే ఈ బైక్ అద్భుతమైన అమ్మకాలు కొనసాగుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: