బుల్లి పిట్ట: ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో కూడా..?

Divya

దేశీయ అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన ఎస్బిఐ కూడా తమ కస్టమర్ల కోసం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇకపై ఎస్బిఐ కస్టమర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఏటీఎంలో కూడా బ్యాలెన్స్ చూసుకోవాల్సిన పనిలేదు కేవలం మన మొబైల్ లోనే వాట్సప్ అకౌంట్ ద్వారా కూడా సులభంగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే ఇది కేవలం ఎస్బిఐ కస్టమర్లకు మాత్రమే ముందుగా ప్రవేశపెడుతోంది.

ఎస్బిఐ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలియజేయడం జరిగింది. వాట్సాప్ లో అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్క కస్టమర్ కూడా వినియోగించుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి వాటికోసం ఎలాంటి యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు మీ అకౌంట్ బ్యాలెన్స్, స్టేట్మెంట్ కూడా అన్నిటిని చెక్ చేసుకోవచ్చు అని ఎస్బిఐ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఎస్బిఐ అకౌంట్ కలిగిన వారు బ్యాంకు సేవలను పొందాలి అనుకుంటే..+919022690226 వంటి నెంబర్కు హాయ్ అని పంపిస్తే చాలు వాట్సాప్ లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పొందవచ్చు అని తెలియజేశారు.

1).అయితే ముందుగా మనం ఎస్బిఐ అకౌంట్ కు ఇచ్చిన మన మొబైల్ నెంబర్ను నుంచి 9172089331 SMS WAREG..A/C అకౌంట్ నెంబర్ ని పంపించాలి.
2). రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే+919022690226 నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పంపాలి.
3). అటు తరువాత మనకు ఎస్బిఐ  దగ్గర నుంచి బ్యాంకింగ్ సేవలకు స్వాగతం అని మెసేజ్ వస్తుంది.

4). ఇక తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ వంటివి అక్కడే మనం తెలుసుకోవచ్చు.

5). బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు 1 టైప్ చేయాలి మినీ స్టేట్మెంట్కు అయితే 2 ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ను ఎస్బిఐ క్రెడిట్ కార్డు కస్టమర్లకు అందుబాటులో ఉన్నది. ఈ విధంగా పలు సేవలను కూడా వినియోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: