బుల్లి పిట్ట: గూగుల్ యాప్స్ ఉపయోగించే వారికి గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

Divya
ప్రస్తుతం మనం ఎలాంటి అవసరం కావాలి అన్న మన మొబైల్ లోనే ప్లే స్టోర్ లో నుంచి కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి సహాయంతో మన పని చేసుకుంటూ ఉన్నాము దీంతో స్మార్ట్ ఫోన్లు వినియోగం విపరీతంగా పెరిగిపోతోందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఈ స్మార్ట్ మొబైల్స్ వల్ల మనకి ఎన్నో పనులు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ, సినిమా టికెట్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ కోసం ఫ్లిప్ కార్ట్ తదితర యాప్లను మనం ఉపయోగిస్తూనే ఉన్నాము.
దీంతో ప్లే స్టోర్లో కొన్ని లక్షల కొత్త యాప్లు వస్తూనే ఉన్నాయి అయితే అన్ని అవసరాలను తీరుస్తున్న యాప్స్ యూజర్ల భద్రతను మాత్రం పట్టించుకోకుండా ఉండడంతో తాజాగా గూగుల్ ప్లే స్టోర్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అడిగే పర్మిషన్స్ యూజర్ల సమాచారాన్ని ఆ యాప్ యొక్క నిర్వహకుల చేతిలో ఉండడంతో యూజర్ల భద్రత ప్రశ్నార్ధకంగా  మారుతోంది. దీంతో ఇక మీదట అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి గూగుల్ సరికొత్త నిబంధనలను తీసుకురావడం జరుగుతోంది కొత్త నిబంధనల ను తీసుకువస్తోంది.
ఇలా కొత్త నిబంధనల ప్రకారం యూజర్లు యాపులను ఇన్స్టాల్ చేసే సమయంలో ఆ యాప్ డెవలపర్స్ ఎలాంటి డేటాను సేకరిస్తున్నారో వాటిని ఎవరితోనైనా పంచుకుంటున్నారు అనే సమాచారాన్ని కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుందట. వారు అందించిన సమాచారాన్ని గూగుల్ తనిఖీ చేసి వాటిని ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచ బోతున్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వాహకులు యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేసిన తక్షణమే వారి పైన చర్యలు చేపడుతుందట. ఈ నిబంధన ఈనెల 20వ తేదీ నుంచి పాటించాలని యాప్స్ పాటించని వాటిని ప్లే స్టోర్ లో నుంచి తొలగిస్తామని ప్రకటించడం జరిగింది. దీంతో ప్లే స్టోర్ యూజర్లకు మాత్రం ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు దీంతో సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: