బుల్లి పిట్ట:5G టెక్నాలజీ తో ఇంటర్నెట్ ప్లాన్ ధరలు కూడా పెరుగుతాయా..?

Divya
తాజాగా 5 జి స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో మీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి వడివడిగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే 5 నెట్వర్క్ అంటే ఏమిటి..?  దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? అనే విషయాలను కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఫైవ్ జి నెట్వర్క్ కస్టమర్లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ మల్టీమీడియా సర్వీసులు అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం జరిగింది. ఇక ఫోర్ జి కంటే 50 రెట్లు వేగవంతం అయింది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఫైవ్ జి ఫోన్ లో బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుంది అని స్పష్టం అయింది. ఇక ఫైవ్ జి డౌన్లోడ్ స్పీడ్ తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడం కూడా చాలా సులభతరం అవుతుంది. అంతేకాదు రిమోట్ లాగా ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కంట్రోల్ చేయవచ్చు. భవిష్యత్తులో 5g వల్ల స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్,, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీకి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. వివిధ దేశాలలో దక్షిణకొరియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా తో పాటు అనేక దేశాలలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇక భారతదేశం విషయానికి వస్తే 4జి సేవల ద్వారా సాధ్యమయ్యే దాని కంటే పది రెట్లు అధికంగా ఉండే సామర్థ్యం, వేగాన్ని అందించగలరు. ఈ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5g ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల ధరలు పెరుగుతాయా అంటే భారతదేశంలో 4g ప్లాన్ ధరలతో సమానంగా 5g ధరలు ఉంటాయి అని ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణధీప్ సేఖోన్ తెలిపారు. ఇప్పటికే భారతదేశంలో పలు 5g ఇంటర్నెట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో 5g ఇంటర్నెట్ లు కూడా త్వరలోనే తీసుకురానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: