ఆపిల్ కంపెనీ ఈసారి ఐఫోన్ 14 మాక్స్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినట్లు లీకులు చెబుతున్నాయి. కాగా, ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు రిలీజ్ చేయడంలో జాప్యం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొత్త ఫోన్లను సెప్టెంబర్ 13 వ తేదీన యాపిల్ విడుదల చేస్తుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ న్యూస్‌పై యాపిల్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇక యాపిల్ జూన్ 6 వ తేదీన నిర్వహించే డెవలపర్ల కాన్ఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2022 ఏర్పాటు చేయడంలో చాలా బిజీగా మారింది. అఫీషియల్ లాంచ్‌కు ముందు, ఐఫోన్ 14 మాక్స్‌తో సహా రాబోయే ఐఫోన్ మోడల్‌ల గురించి పలు లీక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బాగా సందడిచేస్తున్నాయి.
ఇక ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ 6.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఐఫోన్ 12 వంటి వైడ్-నాచ్ని కూడా కలిగి ఉంది. ప్రో మోడల్ వేరే డిజైన్ ఇంకా పిల్-సైజ్ నాచ్ని పొందవచ్చని తెలుస్తోంది.
ఐఫోన్ 14 సిరీస్ లోని నాలుగు మోడల్‌లు కూడా A16 బయోనిక్ చిప్సెట్ తో రానున్నాయి. ఇది iphone 13 సిరీస్‌లో ఉన్న A15 బయోనిక్ చిప్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఆప్టిమైజ్ చేస్తుందని భావిస్తున్నారు.ఐఫోన్ 13 వలె, ఐఫోన్ 14 మోడల్ కూడా 128 GB ఇంటర్నల్ మెమరీని అందించగలదని సమాచారం తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ కెమెరాల గురించి మాట్లాడితే, ఐఫోన్ 14 ఫోన్ వెనుక ప్యానెల్లో డ్యూయల్ రియర్ కెమెరాను పొందవచ్చు. అలాగే ఇక ముందు భాగంలో, ఐఫోన్ 13 మోడల్ వంటి నాచ్‌లో ఒకే కెమెరాను అందించే ఛాన్స్ కూడా ఉంది. ఐఫోన్ 14 సిరీస్‌తో యాపిల్ పాత ఫోన్ల కంటే మెరుగైన బ్యాటరీ పనితీరును కూడా అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తుంది.పుకార్లు ఇంకా లీక్‌ల మేరకు iphone 14 ధర iphone 13 లాగానే దాదాపు $799 ఉంటుందని తెలుస్తోంది. అయితే iphone 14 Max, Pro, Pro Max ధర దాదాపు $899 ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే, అసలు ధరలు మాత్రం relea రోజే తెలియనున్నాయి.