బుల్లిపిట్ట: రియల్ మీ సీ 31 సేల్.. రూ.10 వేల లోపే..!!

Divya
మీలో ఎవరైనా సరే సరి కొత్తగా 10 వేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నట్లయితే.. రియల్ మీ తాజాగా సరికొత్త ఫీచర్లతో ఇండియా మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభించింది. రియల్ మీ సీ 31 స్మార్ట్ ఫోన్ ఆఫర్లు, ఫీచర్లు ఒకసారి తెలుసుకుందాం. రియల్ మీ అభిమానులకు ఇది ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు . ఇందులో యూనిసోక్ ప్రాసెసర్ తో పాటు 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా సెటప్ కూడా అందించడం జరిగింది . అంతే కాదు 5000 ఎం ఎ హెచ్ బ్యాటరీ కూడా అమర్చడంతో చార్జింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాజాగా రియల్ మీ సీ 31 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.10 వేల లోపు బడ్జెట్లో లాంచ్ చేయడం జరిగింది.
ఇప్పటికే రూ.10 వేల లోపు బడ్జెట్లో రియల్ మీ నార్జో 50 ఐ, పోకో సీ 3 ఇలాంటి స్మార్ట్ ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇక వీటికి గట్టిపోటీ ఇవ్వడానికి రియల్ మీ సీ  31.. ఏప్రిల్ 6 అనగా ఈరోజు మధ్యాహ్నం  12 :00 గంటలకు ఫ్లిప్కార్ట్లో సేల్ ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఆఫ్ లైన్ స్టోర్ లో కూడా ఈ మొబైల్ లో కొనుగోలు చేయవచ్చు. కలర్స్ విషయానికి వస్తే .. లైట్ సిల్వర్ , డార్క్ గ్రీన్ కలర్ లో  మనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ ద్వారా రూ.8,999 . 3జీబీ ర్యామ్ అలాగే 32 జీ బీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
ఇప్పుడు 4జీబీ ర్యామ్ అలాగే 64 జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ తో రూ.9,999కే మనకు లభిస్తోంది. ఇక ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డు అలాగే హెచ్ డి ఎఫ్ సి ఐ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ₹1000 డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: