అవి కూడా ఇంధన వనరులే

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో వాటి ద్వారా పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పు గురించి అవగాహన కలిగివున్న ప్రజలు వాటికి బదులు శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణ సాగిస్తూ పలు రకాల కొత్త వాటిని ఆవిష్కరిస్తున్నారు. అలాంటి జాబితాలోకి వస్తాయి ఎలక్ట్రిక్ వాహనాలు. 




ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. వాటి ఇంధనం కోసం బ్యాటరీ తో పాటు సూపర్ కెపాసిటర్లని ఉపయోగిస్తుంటారు. ఈ కెపాసిటర్లని చింతకాయ తొక్కలతోనూ చేయవచ్చు అంటున్నారు సింగపూర్ లోని ప్రముఖ నాన్ యాంగ్ టెక్నాలజీ  యూనివర్సిటీ , నార్వే లోని వెస్ట్రన్ నార్వే యూనివర్సిటీ బృందాలు. 




సాధారణంగా చింతకాయలోని లోపలి గుజ్జు తీసి వాటి పెంకుని వృథాగా పారేస్తారు, కానీ వాటితో విద్యుత్ ను నిల్వచేసే సూపర్ కెపాసిటర్లలో వాడే కార్బన్ నానో షీట్లను తయారు చేయొచ్చు అని అంటున్నారు. ఇందు  కోసం తొక్కల్ని కడిగి  100 డిగ్రీల  ఉష్ణోగ్రత దగ్గర ఎండలో సుమారు 6 గంటల పాటు ఎండబెట్టి , మళ్ళీ వాటిని కడిగి మరోసారి 150 డిగ్రీల లో 6 గంటల పాటు ఎండనిచ్చారట ఆ తర్వాత వాటిని పొడి చేశారు.



ఆ పొడి ని 800 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర సుమారు 60 నిమిషాల పాటు బేక్ చేశారు. దాంతో ఆ పొడి పలుచని కార్బన్ నానో షీట్ లాగా తయారయ్యింది. ఈ కార్బన్ నానో షీట్లలలో సూక్ష్మ స్థాయి లో రంధ్రాలు కలిగి ఉండటంతో విద్యుచ్ఛక్తి ప్రసారానికి అనువుగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. మిగిలిన పదార్థాలతో తయారు చేసే నానో షీట్ల కన్నా దీని తయారీకయ్యే  ఖర్చు , సమయం చాలా తక్కువ అని వారు తెలిపారు. అలాగే, రానున్న రోజుల్లో పర్యావరణానికి ఏంతో మేలు కలిగించే చింతకాయ తొక్కలు కూడా ఇంధన వనరులే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: