బుల్లి పిట్ట: సగం ధరకే స్మార్ట్ టీవీలు..!!

Divya
కొత్త సంవత్సరం రావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే సంవత్సరం పొడవునా ఈ కామర్స్ సంస్థలు అమ్మకాలు నిర్వహించి అందులో మిగిలిపోయిన కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను తమ వినియోగదారులకు సగం ధరకే అమ్మడానికి సిద్ధమయ్యాయి.. ఇయర్ ఎండ్ సేల్ పేరిట అతిపెద్ద ఏ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండూ కూడా అత్యంత విలువైన స్మార్ట్ టీవీ లను దాదాపు 50% డిస్కౌంట్ తో మనకు అందించనున్నాయి. ఇకపోతే.. ఏ ఏ బ్రాండెడ్ టీవీలు మనకు ఏ ధరకు లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్కార్ట్ లో అయితే.. సామ్సంగ్ , థామ్సన్ ,  వన్ ప్లస్ మొదలైన బ్రాండ్ల నుంచి కొనుగోలుదారులు వీటి నుంచి అనేక ఎంపికలను మనం పొందవచ్చు. ఉదాహరణకు వన్ ప్లస్ యు వన్ ఎస్ 55 అంగుళాల హెచ్డీ 4k ఎల్ఈడి స్మార్ట్ టీవీ మనకు 23 శాతం తగ్గింపు తో అందుబాటులో ఉంది. ఇక sony 65 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4k ఎల్ఈడి టీవీ పై  32 % ఆదా చేయవచ్చు. కొడాక్ సి ఎ సిరీస్ 55 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4k స్మార్ట్ టీవీ మనకు మార్కెట్ ప్రకారం 47, 999 రూపాయలు ఉండగా 25% డిస్కౌంట్ తో 35,999 రూపాయలకు లభించనుంది.
Vu ప్రీమియం 55- అంగుళాల అల్ట్రా హెచ్డీ 4k స్మార్ట్  టీవీ మార్కెట్ రేట్ ప్రకారం రూ.75,000 ఉండగా దానిని 50 శాతం తెగింపుతో 36,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
థామ్సన్ ఓత్ ప్రో 65 అంగుళాల ఫోర్ కె అల్ట్రా హెచ్డి ఎల్ఇడి స్మార్ట్ టీవీ మార్కెట్ ధర ప్రకారం రూ.70, 499 ఉండగా 23 శాతం తగ్గింపుతో  53,999 రూపాయలకే మనకు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: